News

Keeravani: అదిరింది తమ్ముడూ.. ‘కనుల చాటు’ సాంగ్‌కి కీరవాణి ప్రశంస.. బ్రేకప్ సాంగ్‌తో బౌన్స్ బ్యాక్ – keeravani praises breakup song of his brother kalyani malik


ఎం ఎం కీరవాణి (Keeravani) RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన కంపోజ్ చేసిన ‘నాటు నాటు’ (Natu Natu) సాంగ్‌కు కాలు కదపనివారు లేరంటే అతిశయోక్తి కాదు. భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ఆ పాట తెగ నచ్చేయగా.. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకోవడంతో పాటు ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్‌గా HCA అవార్డ్స్ వేడుకలో పాల్గొ్న్న స్టార్ కంపోజర్ కీరవాణి.. ఈ మధ్యే విడుదలైన ఒక తెలుగు పాటను సోషల్ మీడియా వేదికగా అభినందించారు.

నాగ శౌర్య (Naga Shourya), మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) తెరకెక్కించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (PAPA) చిత్రంలోని బ్రేకప్ గజల్‌ను కీరవాణి ప్రశంసించారు. ఈ మూవీ నుంచి గతవారం విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘కనుల చాటు మేఘమా’ (Kanula Chaatu Meghama) ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. కాగా.. ఈ పాటను ఎంఎం కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ (Kalyani Malik) కంపోజ్ చేయడం విశేషం. ఈ నేపథ్యంలోనే పాట గురించి ట్వీట్ చేసిన కీరవాణి.. ‘అవసరాల, కళ్యాణి మాలిక్‌ల లేటెస్ట్ ‘కనుల చాటు మేఘమా’ పాటను బ్యూటిఫుల్ మెలోడియస్‌గా పేర్కొన్నారు. ఈ పాటకు లక్ష్మీ భూపాల్ సాహిత్యం అందించగా.. ఆభాస్ జోషి ఆలపించారు.

నిజానికి కళ్యాణి మాలిక్‌కు మ్యాజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో రావాల్సినంత పేరు రాలేదనేది మ్యూజిక్ లవర్స్ మాట. ఆయన కంపోజిషన్స్ విన్న ఎవరైనా ఇదే చెబుతారు. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలోని ‘ఏం సందేహం లేదు’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మొత్తానికి ఈ జనరేషన్‌‌కు సంబంధించి రాక్, పాప్ మ్యూజిక్ ట్రెండ్‌లో కొట్టుకుపోకుడా మనసుకు హాయినిచ్చే సంగీతం అందించడంలో కళ్యాణి మాలిక్ ముందుంటారు. ‘అష్టా చెమ్మా’ సినిమా మ్యూజిక్ కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఏదేమైనా ఆయన చాలా సెలెక్టివ్‌గా సినిమాలకు మ్యూజిక్ అందిస్తుంటారు.

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన PAPA (ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి) చిత్రం మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మేఘా చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాసరి ప్రొడక్షన్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

  • Read Latest Tollywood Updates and Telugu News

Related Articles

Back to top button