Kcr Public Meeting in Khammam, ఖమ్మం సభ వెనక కేసీఆర్ ‘మాస్టర్ మైండ్’.. టార్గెట్ ‘1, 2, 3, 4, 5’ వ్యూహం..! – cm kcr master mind behind khammam public meeting
అయితే.. గులాబీ అధినేత కేసీఆర్ వ్యూహాలు మామూలుగా ఉండవు. ఆయన ఏది చేసినా దాంట్లో పరమార్థం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. కాగా.. ఇప్పుడు బీఆర్ఎస్ ఆవిర్భావ పార్టీ ఖమ్మంలోనే పెట్టటంపై పెద్ద వ్యూహమే ఉందన్నది విశ్లేషకుల వాదన. ఖమ్మంలో ఇప్పటికే అధికార పార్టీలో అంతర్గత విభేదాలున్నాయి.. అటు కాంగ్రెస్‌కు, టీడీపీకి మంచి పట్టుంది. మరోవైపు.. ఖమ్మం జిల్లాలో ఏపీకి చెందిన ప్రజలు కూడా ఎక్కువ మందే ఉంటారు. ఇలాంటి ఖమ్మంలో సభ నిర్వహించటం వల్ల.. ఇటు తెలంగాణ ప్రజలనే కాదు.. అటు ఏపీ జనాలను కూడా కవర్ చేయొచ్చన్నది గులాబీ బాస్ ప్లాన్.
అయితే.. ఇప్పటికే ఏపీలో తొలి అడుగు వేసిన బీఆర్ఎస్ ఈ సభతో అటు ఏపీ ప్రజలను కూడా ఆకర్షించే విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ప్రజలకు ఈ సభ ద్వారా బీఆర్ఎస్ విధివిధానాలకు పంపించవచ్చనే ఖమ్మంను వేదికగా ఎంచుకున్నట్టు సమాచారం. ఇదే కాకుండా.. ఖమ్మంలోని ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గర్లోనే ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కూడా ఉండటం.. అక్కడి ప్రజలు రాకపోకలు సాగిస్తుండటం జరుగుతుంటుంది. కాగా.. ఈ సభ ద్వారా అటు ఛత్తీస్‌గఢ్‌ను కూడా టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది.
ఇలా.. టార్గెట్ 1, 2, 3, 4, 5 వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నట్టు సమాచారం. ఒకే వేదికపైకి అటు 4 రాష్ట్రాల సీఎంలు, ఇద్దరు(2) మాజీ సీఎంలను వేదికపైకి తీసుకురావటమే కాకుండా.. ఇటు 3 రాష్ట్రాల ప్రజలను టార్గెట్ చేయటంతో పాటు.. 5 లక్షల మందితో సభను నిర్వహించేందుకు వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. అలాగే.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు కూడా చెక్ పెట్టేలా గులాబీ బాస్ పెద్ద ప్లానే వేశాడని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
- Read More Telangana News And Telugu News