News

kcr kamareddy tour, Kamareddy: బాన్సువాడకు రూ. 50 కోట్లు.. పోచారంను వదిలేది లేదు: సీఎం కేసీఆర్ – cm kcr allocated funds for the development of bansuwada constituency


KCR Kamareddy Tour: కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో గల వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 7 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. తిమ్మాపూర్‌లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఇవాళ సీఎం దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని స్వామివారికి సమర్పించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం.. ఆలయ అభివృద్ధికి రూ. 7 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆలయం కోసం ఎన్ని చేసినా తక్కువేనని కేసీఆర్ అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ చెప్పారని, దానికి అదనంగా మరో రూ.7 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో గుడిని మరింత సుందరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. గతంలో తాను తిమ్మాపూర్‌కు వచ్చినప్పుడు వెంకటేశ్వస్వామి గుడి ఒక మాదిరిగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆలయం చుట్టూ పొలాలు, చెరువుతో ఆహ్లాదకరంగా మారిందని అన్నారు. తిమ్మాపూర్ శ్రీనివాసుడి దయ బాన్సువాడతో పాటు యావత్‌ తెలంగాణ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

బాన్సువాడ నియోజవర్గ అభివృద్ధికి సీఎం స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద రూ.50 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో బాన్సువాడ నియోజవర్గం చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. స్పీకర్ పోచారం అందరికీ ఆత్మీయుడని, అన్ని తెలిసిన వ్యక్తని కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమ సంయంలో తన ఎమ్మెల్యే పదవికి పోచారం రాజీనామా చేశారని గుర్తు చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి, అవసరాల కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి చిన్నపిల్లాడిలా కొట్లాడుతాడన్నారు. బాన్సువాడకు పోచారం సేవలు అవసరమని.., వయసు పైబడుతున్నా ఆయన్ను వదిలేది లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయాలని కోరారు.

ఉమ్మడి రాష్ట్రంలో మనం సింగూరు నీళ్లు కోల్పోయామని అన్నారు. సాగునీటి కోసం తెలంగాణ రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. ఆనాటి పాలకులు పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేపట్టడానికిగల కారణాల్లో నిజాంసాగర్‌ నీళ్లు కూడా ఒకటని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button