News

kcr grandson ritesh rao arrest, పుట్టినరోజున కేసీఆర్ మనవడి హౌస్ అరెస్ట్.. పోలీసులపై తీవ్ర ఆగ్రహం – cm kcr grandson ritesh rao house arrest on his birthday


Authored by Ramprasad | Samayam Telugu | Updated: 2 Mar 2023, 4:22 pm

సీఎం కేసీఆర్ మనవడిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పుట్టిన రోజునాడే.. పోలీసులు గృహ నిర్బంధం చేయటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేగుల పాటి రితేష్ రావు. కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ నేత రమ్య రావు కుమారుడైన రితేష్ రావు పుట్టిన రోజు ఇవాళ. కాగా.. ఎన్‌ఎస్‌యూఐ నాయకుడైన రితేష్ రావు.. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేఖ కార్యక్రమాలు చేపడతారన్న కారణంగా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా గృహ నిర్బంధం చేశారు. కాగా.. పోలీసుల తీరుపై రితేష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

rithesh rao
రితేష్ రావు

ప్రధానాంశాలు:

  • పుట్టినరోజునాడే కేసీఆర్ మనవడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
  • పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రితేష్ రావు
  • ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారన్న కారణంతో గృహనిర్బంధం
సీఎం కేసీఆర్ మనవడిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. తన పుట్టినరోజున హౌస్‌ అరెస్ట్ చేయడంతో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ మనువడు రితేష్ రావు. కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ నేత రమ్యరావు కుమారుడైన రేగుల పాటి రితేష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విద్యార్థి సంఘ నాయకుడైన తనను పోలీసులు తెల్లవారుజామున 2 గంటల సమయంలోనే ఇంటి తలుపులు తట్టి హౌస్ అరెస్టు చేస్తున్నట్లుగా తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా గ్రహ నిర్బంధం చేసి ఎవ్వరూ రాకుండా… తాను బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని కేసీఆర్ మనవడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరిలో కూడా రితేష్ రావును పోలీసులు అర్థరాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సుమారు రెండు రోజుల పాటు తన కుమారుడు ఎక్కడుక్కున్నాడన్న విషయం చెప్పకపోవటంతో.. ఆయన తల్లి రమ్య రావు డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన అర్ధరాత్రి సమయంలో తన కొడుకుని దౌర్యన్యంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని.. ఎక్కడున్నాడన్న ఆచూకీ కూడా చెప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఇప్పుడు రితేష్ రావు పుట్టిన రోజు సందర్భంగా.. పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేయటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • ‘సార్.. మీరు మారిపోయారు సార్..’ కుక్కల దాడి ఆర్జీవీని ‘మనిషి’గా మార్చేసిందా..?

  • Read More Telangana News And Telugu News

సమీప నగరాల వార్తలు

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related Articles

Back to top button