News

Karur Vysya Bank,బ్యాంక్ కఠిన నిర్ణయం.. ఇక ఈఎంఐ ఎక్కువ కట్టాల్సిందే.. సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి.. – karur vysya bank hikes base lending rate, bplr


Base Lending Rate: కరూర్ వైశ్యా బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. తాజాగా ఈ దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2023, సెప్టెంబర్ 21 నుంచి ఈ పెంచిన వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో బేస్ రేటు ఇప్పుడు 11.20 శాతం నుంచి 11.40 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు మాత్రం 16.20 శాతం నుంచి 16.40 శాతానికి చేరింది. దీంతో ఈ రేట్లు పెరిగితే లోన్ ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి వస్తుంది.

ఆర్‌బీఐ గతేడాది మార్చి నుంచి వరుసగా రెపో రేట్లను పెంచుతూ వచ్చింది. ఇదే క్రమంలో ఏకంగా 250 బేసిస్ పాయింట్లు పెరగ్గా.. బ్యాంకులు అన్ని రకాల లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చాయి. ఇది పర్సనల్ లోన్, హోం లోన్, వెహికిల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ ఇలా అన్నింటిపై వర్తిస్తుంది. మరోవైపు.. ఇవి గరిష్ట స్థాయిలకు చేరాయి కూడా. ఇప్పుడు RBI రెపో రేట్లలో మార్పులు చేయనప్పటికీ.. బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం.

Ratan Tata: అదిరిపోయే న్యూస్.. ఐపీఓకు 11 లక్షల కోట్ల విలువైన టాటా కంపెనీ.. RBI హెచ్చరిక!

  • RBI: రూల్స్ అతిక్రమించిన 4 బ్యాంకులు.. రిజర్వ్ బ్యాంక్ షాక్.. వీటిల్లో మీకు అకౌంట్ ఉందా?

సాధారణంగా ఈ వడ్డీ రేట్లు పెరిగితే కొత్త లోన్ తీసుకునే కస్టమర్లకు ఎక్కువ ఈఎంఐ పడుతుందని చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పటికే లోన్ తీసుకున్న వారికైతే ఈఎంఐ కాలవ్యవధి పెరుగుతుంది. అంటే ఇంకా ఎక్కువ కాలం EMI చెల్లించాల్సి వస్తుంది.

ఇక ఈ బ్యాంక్ ఇటీవల జులైలో కీలక ప్రకటన చేసింది. 1,63,635 ఈక్విటీ షేర్లను తమ ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్‌గా ఇచ్చింది. KVB ESOS 2011 స్కీమ్ & KVB ESOS 2018 స్కీమ్ కింద ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఒక్కో షేరు ఫేస్ వాల్యూ వచ్చేసి రూ.2 గా ఉంది. కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు విలువ ప్రస్తుతం రూ.132.75 గా ఉంది. శుక్రవారం సెషన్‌లో దాదాపు 2 శాతం పుంజుకుంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 137.75 కాగా.. కనిష్ట విలువ రూ.76.80 గా ఉంది. దీని మార్కెట్ విలువ రూ. 10.57 ట్రిలియన్ కోట్లుగా ఉంది.

SBI: ఎస్‌బీఐ ఒకవైపు ఆఫర్.. ఇప్పుడు ఇంత పని చేసిందేంటి? నేటి నుంచే అమల్లోకి.. ఏం ప్రకటన చేసిందంటే?

PM Kisan 15th Installment: రైతులకు అదిరే శుభవార్త.. పండగ బొనాంజా.. ముందే అకౌంట్లలోకి డబ్బులు!

Read Latest Business News and Telugu News

Advertisement

Related Articles

Back to top button