News

karthika deepam serial, Karthika Deepam ఆగష్టు 5 ఎపిసోడ్: ‘మీ పెళ్లి జరగదు.. వేరే సంబంధం చూసుకో’ బిత్తరపోయిన శోభ – sathyam informs nirupam about swapna’s disappointment in karthika deepam 2022 august 5 episode preview


గత ఎపిసోడ్‌లో హిమ చెంప పగలగొట్టిన సౌందర్య.. ‘నిరుపమ్‌కి నీకు పెళ్లి జరిగి తీరుతుంది’ అని క్లారిటీ ఇస్తుంది. దీంతో కథనం ఆసక్తిగా మారింది.

1423 ఎపిసోడ్ హైలైట్స్..
ఇక సౌందర్య ఆవేశానికి అడ్డే లేకుండా పోయింది. హిమని నోరు ఎత్తనివ్వకుండా.. చేసింది. ఇంతలో ఈవెంట్ మ్యానేజర్ రావడంతో.. ‘పనుల్నీ నేను చెప్పిన ప్రకారం జరిగిపోవాలి.. ఏది తేడా వచ్చినా ఊరుకునేది లేదు’ అంటుంది అతడితో సౌందర్య. అంతా సౌర్య కూడా వింటుంది. సౌర్య విందన్న విషయం హిమ కూడా చూస్తుంది. సీన్ కట్ చేస్తే.. స్వప్న దగ్గరకు శోభ వేగంగా వెళ్లీ..‘వాళ్లు పెళ్లిపనులు మొదలు పెట్టేశారట ఆంటీ’ అంటుంది కంగారుగా. ‘పెళ్లి పనులు మొదలుపెట్టినంత మాత్రాన్న పెళ్లి జరిగిపోతుందా శోభా? ఇది కచ్చితంగా ఆగే తీరుతుంది’ అంటుంది స్వప్న. ఇంతలో ప్రేమ్, సత్యం రావడం గమనించిన శోభ.. ‘ఆంటీ ఇలా అయితే ఎలా..? తినకుండా ఉంటారేంటీ మీరు.. మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.. మీరు ఇలా కడుపు మార్చుకుంటే పెళ్లి ఆగిపోతుందా? రెండు రోజులు నుంచి మీరేం తినట్లేదు’ అంటూ డ్రామా స్టార్ట్ చేస్తుంది. అంతా విన్న సత్యం, ప్రేమ్ కంగారు పడతారు. ‘ఇలా అయితే ఎలా?’ అంటారు ఇద్దరూ.

‘ప్లీజ్ మమ్మీ నువ్వు అలా ఆలోచించకు.. నువ్వు నేను.. శోభ.. డాడీ అంతా కలిసి.. నిరుపమ్ మనసు మారుద్దాం.. తినకుండా ఉండకు.. ఏదొకటి చేద్దాం.. పెళ్లి ఆపుదాం లే’ అంటాడు ప్రేమ్. ‘నేను వెళ్లి కాఫీ తెస్తాను’ అంటుంది శోభ. ‘అందులో కొంత విషం తెచ్చి ఇవ్వు.. గొడవమొత్తం పోతుంది’ అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది స్వప్న. వెంటనే శోభ.. ‘ఆంటీ.. ఆంటీ..’అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ.. స్వప్న వెనుకే పరుగుతీస్తుంది. సత్యం సౌందర్య ఇంటికి వెళ్తాడు. ‘మీ మమ్మీ తిండీ తిప్పలు మానేసి కూర్చుందిరా’ అంటాడు సత్యం. ‘మమ్మీ మీకు అన్నీ తెలుసు.. తెలిసి కూడా ఏం చెయ్యలేరు డాడీ.. మమ్మీ ఆలోచనలు ఏంటో మీకు తెలుసు.. మీరు చెప్పినా మమ్మీ వినదు. నేను రాను డాడీ.. కావాలనే మమ్మీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది’ అని తెగేసి చెబుతాడు నిరుపమ్. దాంతో సత్యం ఇంటికి వచ్చి.. ‘నిరుపమ్ మన మాట వినేలా లేడు స్వప్నా.. నువ్వు తిను..’ అంటూ బతిమలాడతాడు. అక్కడే ఉన్న శోభతో.. ‘అమ్మా శోభా నీకు వాడికి పెళ్లి కావడం అసంభవం.. మంచి సంబంధం ఏదైనా..’ అంటూ సత్యం మాట పూర్తి చేయకుండానే స్వప్న రెచ్చిపోతుంది. ‘శోభ నా మనిషి.. నేను అనుకున్నది చేసి తీరతాను.. అమ్మా శోభా నీకు అండగా నేను ఉంటాను.. నా కొడుకుతో తన పెళ్లి చేస్తాను’ అంటూ భర్త ముందు మరోసారి శపథం చేసి శోభను తీసుకుని వెళ్లిపోతుంది.

ఇక నిరుపమ్ బాధగా కూర్చుని ఉంటే.. హిమ వెళ్లి సౌర్య గురించి మంచిగా చెబుతుంది. ‘తనకు జీవితాన్ని ఇవ్వు బావా.. చిన్నప్పటి నుంచి తను ఎన్నో కోల్పోయింది.. తనకి నువ్వే జీవితం ఇవ్వాలి బావా.. అంటూ రిక్వస్ట్‌గా మాట్లాడుతుంది. ‘హిమా.. నేను సౌర్య మనసుని బాధపెట్టాలనే కిడ్నాప్ తర్వాత గదిలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాను.. అంటూ విషయం చెబుతాడు. (సౌర్య నీ ప్లేస్‌లో హిమ ఉండి ఉంటే.. నేను ఇంకా చెత్త ప్లేస్‌లో కూడా బాగానే ఉంటాను.. మనం ఎక్కడ ఉన్నాం అన్నది కాదు.. ఎవరితో ఉన్నాం అనేది ముఖ్యం అని నిరుపమ్ సౌర్యతో అని బాధపెడతాడు) అదే విషయం చెప్పగానే.. ‘అలా ఎందుకు చేశావ్ బావా’ అంటుంది హిమ బాధగా.. ‘అప్పుడే సౌర్య మనసులోంచి పూర్తిగా నన్ను తీసేస్తుందని అలా చేశాను.. నువ్వు సౌర్య జీవితం గురించి ఆలోచిస్తున్నావ్… కానీ నా ఆశలు గురించి ఆలోచించడం లేదు.. సౌర్య మనసులో ఇప్పుడు నేను పూర్తిగా లేను.. సో పెళ్లి చేసుకుంటా అన్నా సౌర్య నో అంటుంది.. ఇది క్లియర్ హిమా ఎక్కువ ఆలోచించకు’ అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్.

తెల్లారే నిరుపమ్ స్వప్నని చూడటానికి ఇంటికి బయలుదేరతాడు. ఓ పక్క సౌందర్య, ఆనందరావులు.. పెళ్లి పనులు చేసే ఈవెంట్ మ్యానేజర్‌తో మాట్లాడుతూ ఉంటారు. నిరుపమ్ కారు తీయడం చూసిన సౌందర్య.. నిరుపమ్‌ని ఆపుతుంది. ఇంతలో హిమ కూడా ఆగు బావా అంటూ పరుగున వస్తుంది. ‘అసలు వెళ్లడానికి వీల్లేదు అంటే వీల్లేదు.. స్వప్న మార్చే ప్రమాదం ఎక్కువ’ అంటూ ఇటు హిమ… అటు సౌందర్య నిరుపమ్‌కి నచ్చజెబుతారు. ‘మీ అమ్మతో భోజనం చేయించే బాధ్యత నాది.. నువ్వు లోపలికి వెళ్లు’ అంటుంది సౌందర్య. దాంతో నిరుపమ్ లోపలికి వెళ్లిపోతాడు. అంతా పై నుంచి చూస్తున్న సౌర్య.. ‘ఆహా.. ఓ నాన్నమ్మ.. ఓ తాతయ్య.. ఓ బావ.. అద్భుతమైన ప్రేమలు.. అంతా హ్యాపీగానే ఉన్నారు.. ఇక్కడ నేను అవసరమా?’ అనుకుంటుంది బాధగా.

ఇక సత్యం టిఫిన్ తింటూ ఉంటే.. శోభ వచ్చి.. ‘అంకుల్ ఏం చేస్తున్నారు’ అంటుంది వెటకారంగా. ‘తింటున్నా కదమ్మా’ అంటాడు సత్యం తింటూనే. ‘తినండి అంకుల్ బాగా తినండి. అవతల ఆంటీ తిండీ నిద్ర లేకుండా ఉంటే.. మీరు మాత్రం బాగా తినండి’ అంటూ పెత్తనం చేసే ప్రయత్నం చేస్తుంది. వెంటనే శోభ చెంప పగులుతుంది. తిరిగి చూస్తే సౌందర్య ఉంటుంది. ‘నన్ను ఎందుకు కొట్టారు?’ అంటుంది శోభ సౌందర్యని. ‘నా కూతురు ఇంట్లో నీ పెత్తనం ఏంటీ?’ అంటుంది సౌందర్య. స్వప్న పరుగున వచ్చి.. ‘నాకు కాబోయే కోడల్నే కొడతావా?’ అంటుంది ఆవేశంగా.. ‘ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతాను’ అంటుంది సౌందర్య ఆవేశంగా. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘కార్తీకదీపం’ karthika deepam కొనసాగుతోంది.

Related Articles

Back to top button