News

karthika deepam serial, Karthika Deepam ఆగష్టు 1 ఎపిసోడ్: సౌర్యని కాపాడటానికి వెళ్లిన నిరుపమ్ అదే ఇంట్లో బందీ.. ‘కిడ్నాప్ చేయించింది శోభే’ – hima gets tensed as sourya goes missing in karthika deepam 2022 august 1 episode preview


గత ఎపిసోడ్‌లో సౌర్య.. హిమ మీద కోపంతో ఇంట్లోంచి బయటికి.. ఆటోలో వచ్చేసిన సంగతి తెలిసిందే కదా.. ఈ క్రమంలోనే నేటి కథనం చాలా ఉత్కంఠగా మారిపోయింది. గత ప్రోమోలో సౌర్య కిడ్నాప్ చూసి.. శోభే వెనుక ఉండి నడిపిస్తుందా? అనే అనుమానం కలిగింది. అదే నిజమైంది. నేటి హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

1420 ఎపిసోడ్ హైలైట్స్..
సౌర్య ఆటోలో వెళ్తూ నిరుపమ్, హిమల గురించే ఆలోచిస్తుంది. ఇంతలో దారిలో అడ్డంగా ఓ వ్యక్తి పడి ఉండటం చూసి.. పక్కకు ఆటో ఆపుతుంది కంగారుగా. వెంటనే ఆటో దిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తుంది సౌర్య. నోట్లోంచి నురుగు వస్తుంటే.. ఆ వ్యక్తిని సాయం చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వస్తారు. వాళ్లు ఎవరో కాదు ఆ రోజు సౌర్య పోలీసులకు పట్టించిన రౌడీలు.
‘నువ్వా’ అంటుంది సౌర్య ఆ రౌడీలో ఒకడ్ని చూసి. ‘గుర్తు పట్టిందిరో’ అంటాడు వాడు నవ్వుతూ. ఇంతలో రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్నవాడు పైకి లేచి కూర్చుంటాడు. ఒక్కసారిగా సౌర్య షాక్ అయిపోతుంది. ఇటు నుంచి వీడు.. అటు నుంచి ఆ ఇద్దరూ సౌర్యని గట్టిగా పారిపోకుండా, తప్పించుకోకుండా పట్టుకుంటారు. ఎంత గింజుకున్న వదిలిపెట్టకుండా కారులో ఎక్కించుకుని ఓ ఇంటికి తీసుకుని వెళ్తారు. కళ్లకు గంతలు కట్టి, నోటికి క్లాత్ చుట్టి.. లాక్కెళ్లి.. ఓ టైర్‌లో కూర్చోబెట్టి కట్టేస్తారు. తర్వాత అందులో ఒకడు.. శోభకు కాల్ చేస్తాడు.

‘పని అయిపోయింది మేడమ్.. అంతా కూల్‌గానే జరిగింది.. డబ్బులు పంపిస్తారా?’ అంటూ మాట్లాడతాడు. శోభ నవ్వుతూ.. ‘తప్పకుండా.. ఒకసారి దూరం నుంచి వీడియో కాల్ చేసి చూపించండిరా’ అంటుంది. దాంతో వీడియోకాల్ చేసి సౌర్యని చూపించడంతో.. శోభ రగిలిపోతుంది. ‘నన్నే కొడతావా కదా? తేలుస్తాను.. అందరి లెక్కలు తేలుస్తాను’ అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే.. ఎంతసేపటికీ సౌర్య ఇంటికి రాలేదు అని.. హిమ కంగారుపడుతుంది. సౌందర్య, ఆనందరావు, నిరుపమ్ కూడా టెన్షన్ పడతారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటాడు నిరుపమ్. అలా ఇస్తే.. సౌర్య కోపం వచ్చే ప్రమాదం ఎక్కువ అంటుంది సౌందర్య. దాంతో అంతా వెతకడం మొదలుపెడతారు. నిరుపమ్ తన కారులో ఒంటరిగా వెతుకుతుంటే.. హిమ, ప్రేమ్ కలిసి ఒకే కారులో సౌర్యని వెతికే ప్రయత్నం చేస్తుంటారు.

ఇంతలో నిరుపమ్‌కి ఓ రోడ్డు పక్కన ఆటో కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే అది సౌర్యదే అని తెలుస్తుంది. ‘సౌర్య ఆటో ఉంది కానీ.. మనిషి లేదేంటీ?’ అనుకుంటూ అంతా వెతుకుతూ చుట్టూ చూస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న ఓ పిచ్చివాడు.. ‘నేను చూశాను.. పాపని వాళ్లు ఎత్తుకుని వెళ్లారుగా.. ’ అంటాడు ఎగురుతూ చప్పట్లు కొడుతూ.. నిరుపమ్ షాక్ అవుతాడు. నిజం చెప్పు అంటే వాడు సరిగా చెప్పడు. పదిరూపాయలు ఇవ్వు.. భోజనం చేస్తాను అంటాడు. వంద ఇస్తే వద్దు అంటాడు. దాంతో పది కాగితం ఇచ్చి.. ఇప్పుడు చెప్పు అంటాడు. ‘వాళ్లు తనని ఇలా దూరంగా వెళ్తే ఓ ఇల్లు వస్తాది.. అక్కడికే తీసుకుని వెళ్లుంటారు. భోజనం పెడుతారులే.. నేను చెబుతాను.. వాళ్లు తనని తీసుకుని వెళ్లారు. ఇదిగో ఇలా వెళ్తే ఆ ఇల్లు వస్తుంది’ అంటూ చూపిస్తాడు.

వెంటనే నిరుపమ్ ప్రేమ్‌కి లొకేషన్ షేర్ చేసి.. ఆ ఇంటికి వెళ్లిపోతాడు. ఇక ఇంటి ముందు కారు వచ్చి ఆగేసరికి.. ఆ రౌడీలకు అనుమానం వచ్చి బయటికి వచ్చి చూస్తారు. నిరుపమ్ పక్కకు తప్పుకుని.. రౌడీలో మళ్లీ లోపలికి వెళ్లి తలుపు పెట్టుకునే టైమ్‌కి ఒకే ఒక్క తన్ను తన్నుతాడు. దాంతో ముగ్గురూ లోపలికి పడిపోతారు. వెంటనే నిరుపమ్ వేగంగా లోపలికి వెళ్లి చూసేసరికి.. సౌర్య నోటికి ప్లాస్టర్ వేసి కనిపిస్తుంది. ఇక సౌర్యని విడిపించే క్రమంలో నిరుపమ్ వాళ్లని కొడతాడు. ఆ దెబ్బలు తాళలేక.. బయటికి పరుగుతీసిన రౌడీలు.. సౌర్య కట్లు విప్పేలోపు తలుపు బయట నుంచి గడియ పెట్టేస్తారు. సౌర్య మూతికి ఉన్న ప్లాస్టర్ కూడా తీసేసిన నిరుపమ్.. ‘ఏంటి థాంక్స్ చెప్పవా?’ అంటాడు సౌర్యతో. ‘ముందు బయటికి వెళ్దామా’ అంటుంది సౌర్య పొగరుగా. తలుపు దాకా వెళ్లి లాగితే రాదు. కొడితే వాళ్లు తియ్యరు. వెనుక డోర్ లాగినా రాదు.

రౌడీలు వెంటనే శోభకు వీడియో కాల్ చేసి.. ‘ఒకడు వచ్చాడు మేడమ్.. మమ్మల్ని కొట్టాడు.. మేము ఇద్దరినీ బందించాం’ అని చెబుతూ కిటికీ అద్దాల్లోంచి చూపిస్తారు. వీడియో కాల్‌లో నిరుపమ్‌ని చూసిన శోభ.. ఖంగుతింటుంది. ‘రేయ్.. ముందు అక్కడ నుంచి పారిపోండ్రా.. తనకి కానీ దొరికారో.. నేనే మిమ్మల్ని చంపేస్తాను’ అని అరుస్తుంది. వెంటనే వాళ్లు పరుగుతీస్తారు.

ఇక ప్రేమ్, హిమ వాళ్ల కారు వచ్చి ఆగేసరికి.. రౌడీలు కారు వేసుకుని పారిపోతారు. ‘రేయ్ ఆగండ్రా.. అని ప్రేమ్ పరుగుతీస్తాడు కానీ.. దొరకదు. ఇక సౌర్య, నిరుపమ్ లోపలి నుంచి బయటికి రావడానికి దారి లేక.. తలుపు రాక అటు ఇటు తప్పించుకునే అవకాశం కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో సౌర్యకు విసుగు పుట్టి.. కిడ్నాప్ చేసిన కుర్చీలోనే కూర్చుంటుంది. ‘ఏంటీ బాగా అలవాటు అయిపోయిందా?’ అంటాడు నిరుపమ్. పట్టించుకోదు సౌర్య. వెంటనే సోఫా లాక్కున్న నిరుపమ్ అందులో కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటాడు. సౌర్య పొగరుకు దీటుగా..

ఇక ప్రేమ్ వాళ్లు గుమ్మం దాకా వచ్చి.. సౌర్యా, నిరుపమ్ అని పిలుస్తారు. వెంటనే సౌర్య, నిరుపమ్ గుమ్మం దాకా వెళ్లి తలుపు తీయండి అంటారు. ప్రేమ్ వెంటనే.. హిమకు సైగ చేసి.. ‘ఇక్కడేదో పెద్ద తాళం వేసి ఉందిరా’ అని అబద్దం చెబుతాడు ప్రేమ్. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘కార్తీకదీపం’ karthika deepam కొనసాగుతోంది.

Advertisement

Related Articles

Back to top button