Karnataka High Court,High Court: నల్లగా ఉన్నాడని భర్తను అవమానించిన భార్య.. షాకిచ్చిన హైకోర్టు – wife calling husband dark skinned amounts to cruelty says karnataka high court grants divorce
కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఓ జంటకు 2007 లో పెళ్లయింది. వివాహం జరిగిన కొత్తలో వారి సంసారం అంతా సాఫీగానే సాగింది. కొన్నాళ్లకు వారికి ఒక ఆడ పిల్ల కూడా పుట్టింది. అయితే ఆ తర్వాతే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త నల్లగా ఉన్నాడంటూ ఆ భార్య పదే పదే హేళన చేసేది. అది కాస్తా వారిద్దరి మధ్య గొడవలకు కారణమైంది. ఈ గొడవల మధ్యలో నల్లగా ఉన్నావంటూ తరచూ భార్య తిట్టడంతో ఆ భర్తకు విసుగు వచ్చింది. దీంతో వేరుగా ఉంటూ.. 2012 లో విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తమకు పుట్టిన బిడ్డ కోసమే చాలా రోజులు తన భార్య చేసిన అవమానాలన్నీ భరించానని ఇక తన వల్ల కాదని.. విడాకులు ఇవ్వాలని కోరాడు. భర్త వయసు 44 ఏళ్లు కాగా.. భార్య వయసు 41 ఏళ్లు.
ఇక భర్త విడాకులు కావాలంటూ కోర్టుకు చేరడంతో భార్య కూడా రంగంలోకి దిగింది. భర్త, అత్తామామలపై కేసు పెట్టింది. తనను బాగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని.. అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని.. గృహ హింస చట్టం, వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో తన భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ తర్వాత వారికి పుట్టిన ఆడపిల్లను తన తల్లిదండ్రుల వద్దకు పంపించింది. అయితే వీరి విడాకుల కేసు ఐదేళ్లపాటు కొనసాగాయి. వాదనలు, వాయిదాలు పూర్తయిన తర్వాత 2017లో ఫ్యామిలి కోర్టు భర్త వేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టివేసింది.
దీంతో ఆ వ్యక్తి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు.. భార్య చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని.. కుట్రపూరితమైనవని తేల్చింది. భర్త నల్లగా ఉన్నాడని పదే పదే ఎద్దేవా చేయడం, అవమానాలకు గురి చేయడం క్రూరమైన చర్య కిందికి వస్తుందని పేర్కొంది. దీంతో భర్తకు వాటి నుంచి విముక్తి కల్పించేందుకు వారికి విడాకులు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది.
Read More Latest National News And Telugu News