News

Karnataka: కన్నడ కాంగ్రెస్‌లో ఖతర్నాక్ టర్న్.. స్వరం పెంచిన డీకే.. బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు..! – Telugu News | KPCC chief D.K. Shivakumar Sensational Comments on CM Post of Karnataka


కర్నాటక కాంగ్రెస్‌లో రెబల్‌స్టార్‌గా కనిపిస్తున్నారు డీకే శివకుమార్. సీఎం సీటుపై హైకమాండ్ ఎటూ తేల్చక ముందే.. బిగ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు పీసీసీ చీఫ్ డీకే. కొంతమంది తాను రాజీనామా చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీలో చేరుతున్నానంటూ తన ప్రతిష్ట దెబ్బతీస్తున్న..

Karnataka: కన్నడ కాంగ్రెస్‌లో ఖతర్నాక్ టర్న్.. స్వరం పెంచిన డీకే.. బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు..!

Kpcc Chief Dk Shiva Kumar

కర్నాటక కాంగ్రెస్‌లో రెబల్‌స్టార్‌గా కనిపిస్తున్నారు డీకే శివకుమార్. సీఎం సీటుపై హైకమాండ్ ఎటూ తేల్చక ముందే.. బిగ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు పీసీసీ చీఫ్ డీకే. కొంతమంది తాను రాజీనామా చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీలో చేరుతున్నానంటూ తన ప్రతిష్ట దెబ్బతీస్తున్న వాళ్లపై పరువునష్టం దావా వేస్తానన్నారు.

అవును, కర్నాటక సీఎంపై కాంగ్రెస్ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటున్న సమయంలో పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తాను రాజీనామా చేస్తునట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాళ్లపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ తనకు తల్లి లాంటిదని , హైకమాండ్‌తో పాటు 135 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు డీకే శివకుమార్‌. కర్నాటకలో కాంగ్రెస్‌ తానే నిర్మించానని అన్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అవతున్నారు డీకే శివకుమార్‌. మరో గంట తరువాత సిద్దరామయ్య కూడా ఖర్గేతో సమావేశమవుతారు.

ఇవి కూడా చదవండి

Advertisement



ఇవాళ ఉదయం ఖర్గే నివాసంలో కాంగ్రెస్‌ నేతల కీలక సమావేశం జరిగింది. రాహుల్‌గాంధీ,కేసీ వేణుగోపాల్‌, సూర్జేవాలా ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం ఎంపికపై ఈ సమావేశంలో జరిగింది. రాహుల్‌తో జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయంపై డీకే శివకుమార్‌, సిద్దరామయ్యకు వివరిస్తున్నారు ఖర్గే. కాగా, సీఎం పదవి కోసం అటు సిద్దరామయ్య , ఇటు డీకే శివకుమార్‌ ఢిల్లీలో జోరుగా లాబీయింగ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button