News

Kantara: భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న కాంతార కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే..


ఈసినిమా ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయ్యింది.అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగులో గత నెల 15న విడుదల చేశారు.ఇక్కడ కాంతార సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒకే ఒకజ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అదే కాంతార.కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈసినిమా ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయ్యింది.అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగులో గత నెల 15న విడుదల చేశారు.ఇక్కడ కాంతార సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దాదాపు 16 కోట్లతో తెరకెక్కించగా ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూల్ చేసింది. కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటూ కలెక్షన్స్ సాధిస్తోంది.

ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన హైలైట్ అనే చెప్పాలి.. వన్ మ్యాన్ షో గా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా అదే రేంజ్ లో  నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు ఆయన 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ 1.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆమె ఈ సినిమాలో గ్రామీణ యువతిగా నటించి మెప్పించింది.

అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించింది కిషోర్.. ఆయన కాంతార మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు ఆయన కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించిన అచ్యుత్ కుమార్ కాంతార మూవీ కోసం  75 లక్షలు తీసుకున్నారట.

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button