News

kakani govardhan reddy, ఈసారి రైతు భరోసాతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులు.. రైతులకు మంత్రి కాకాణి గుడ్ న్యూస్! – minister kakani govardhan reddy fires on tdp chief chandrababu naidu and pawan kalyan


ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పాలనే దురుద్దేశంతోనే తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం అంచనాలకు సంబంధించిన సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఈ నెల 25వ తేదీన వస్తుందని తెలిపారు.ఈసారి వైఎస్సార్ రైతు భరోసాతో కలిపి ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందజేస్తామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఇన్‌పుట్ సబ్సిడీని సీజన్ ముగిసే లోపే చెల్లిస్తున్నామని మంత్రి కాకాణి చెప్పారు. అలాగే, అకాల వర్షాల వల్ల తడిచిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి కాకాణి తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై మంత్రి కాకాణి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అసహ్యన్నీ జయించిన నాయకుడు చంద్రబాబు అని.. ఆయన మాటలు పట్టించుకోవాలిసిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకుంటారనే సమాచారం తెలిసే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి తుఫానులు రాకుండా అడ్డుకున్నామని గొప్పలు చెప్పుకున్న చరిత్ర చంద్రబాబు సొంతమని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓర్వలేకపోతున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం – జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని వైసీపీని ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. కానీ వైసీపీ మాత్రం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి ఘన విజయం సాధించబోతోందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తుండటాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని మంత్రి కాకాణి గుర్తు చేశారు.

ఐక్యరాజ్య సమితికి ఆర్బీకేలు ఎంపిక: మంత్రి కాకాణి

Related Articles

Back to top button