News

Kailasa: నిత్యానందం సంచనలం.. అమెరికాలోని ఓ రాష్ట్రంతో ద్వైపాక్షిక ఒప్పందం | Nithyananda’s United States of KAILASA and the City of Newark New Jersey USA, entered into a protocol bilateral agreement Telugu News


నిత్యానంద… ఇతడు మాములు కామానంద కాదు. నటితో ఇతడి వీడియోలు వైరల్ అయ్యి సంచలనం రేపాయి. అయ్యాగారిపై పలు కేసులు కూడా ఫైలై ఉన్నాయి. వన్ ఫైన్ డే దుకాణం ఎత్తేశారు.

Kailasa: నిత్యానందం సంచనలం.. అమెరికాలోని ఓ రాష్ట్రంతో ద్వైపాక్షిక ఒప్పందం

United States of KAILASA and the City of Newark, New Jersey, USA, entered into a protocol bilateral agreement

సైలెంట్‌గా సత్తా చాటుతున్నాడు స్వామి నిత్యానంద. భారత్‌ నుంచి చెక్కేసి ఎక్కడో దక్షిణ అమెరికా దీవుల్లో తిష్టవేసి స్వామీజీ మరోసారి వార్తల్లోకెక్కాడు. తన దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే పనిలో ఉన్నాడు నిత్యానంద. నిత్య వివాదాల స్వామి నిత్యానంద కైలాస రాజ్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరూ నమ్మలేదు. కాని అమెరికా లోని ఓ రాష్ట్రం ఆ దేశాన్ని గుర్తించింది. అంతేకాదు నిత్యానంద కైలాసంతో నెవార్క్ సిటీ ద్వైపాక్షిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

ఇక తన దేశానికి అమెరికానే గుర్తింపు ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు నిత్యానంద. న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్‌ సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. న్యూజెర్సీ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన సిటీగా నెవార్కకు పేరుంది. సిటీ కౌన్సిల్‌ నిత్యానంద కైలాసదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనం రేపుతోంది. కాగా అమెరికాలో ప్రతి రాష్ట్రానికో చట్టం అమల్లో ఉంటుంది. ఎవరికి వాళ్లు సొంతంగా ఒప్పందాలు కుదుర్చుకునే వీలుంటుంది.

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 50 సార్లు కోర్టుకు హాజరై, 2019 నవంబర్లో భారత్ వదిలి ప‌రార్ అయ్యారు. ప్ర‌స్తుతం ‘కైలాస’ అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన చేసుకున్నారు. కొద్దిరోజులకు కైలాస డాల‌ర్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపాన్ని
నిత్యానంద కైలాసంగా మార్చినట్టు వార్తలు వచ్చాయి.

Advertisement

మరిన్ని అంతర్జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి. 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button