News

kadapa seven died in accident, కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, తిరుమల నుంచి వస్తుండగా! – seven dead in accident at kadapa district


Authored by Thirumala Babu | Samayam Telugu | Updated: 15 May 2023, 7:26 am

Kadapa Road Accident తిరుమల నుంచి తాడిపత్రికి తుఫాన్ వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో చిత్రావతి బ్రిడ్జి దగ్గర లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం.

 

ప్రధానాంశాలు:

  • కడప జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది
  • ఏడుగురు దుర్మరణం, నలుగురికి గాయాలు
  • తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఘటన
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో తిరుమల నుంచి తాడిపత్రికి వెళుతున్న తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగుర్ని ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మృతులు తాడిపత్రి వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

సమీప నగరాల వార్తలు

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related Articles

Back to top button