NTR 30: ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది..
దేవర వచ్చేశాడు..! ఉవ్వుత్తున్న ఎగిసిపడుతున్న రాకాసి అలల మధ్యలో..! తన కోసం కాపుకాసిన ముష్కరులను చీల్చుకుంటూ..! కత్తలను బళ్లాలను.. వారి శరీరాల్లో దించుకుంటూ..! కత్తికో కండగా.. వారి దేహాలను నరుక్కుంటూ..! ప్రశాంతంగా ఉన్న కడలిలో నెత్తురు లావాను పారిస్తున్నాడు. రాజ్యాన్ని ఏలే రాజులా..! అడవిని ఏలే మృగరాజులా..! తన కోసం నిరీక్షిస్తున్న ప్రజలకు దేవరగా.. అడుగులో అడుగేసి మరీ వస్తున్నాడు. కొత్త అధ్యాయాన్ని మొదలెట్టబోతున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో.. తెరకెక్కుతున్న సినిమా నుంచి తాజాగా దిమ్మతిరిగే అప్డేట్ వచ్చేంది. రేపు అంటే మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే ఉండడంతో.. ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు.. టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు “దేవర ” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో సముద్రం మధ్యలో చేతిలో గొడ్డలితో సీరియస్ లుక్ లో కనిపిస్తున్న తారక్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హీరోగా ముష్కరులను ఊచకోత కోసే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పచ్చినెత్తురు తాగే విలన్‌గా అవతారమొత్తబోతున్నారు. క్యారెక్టర్ ఏదైనా.. రౌద్రాన్ని పారించే ఈ గ్లోబల్ స్టార్.. ఇప్పుడు వచ్చేశారు. జనతా గ్యారెజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి జాన్వీ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. కొద్దిరోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
Advertisement
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి