News

Jonnagiri Diamond Found,కర్నూలు: రైతుకి పొలంలో దొరికిన విలువైన వజ్రం.. ధర ఎంతంటే! – another farmer found a diamond in agriculture land in jonnagiri near tuggali kurnool district


కర్నూలు జిల్లాలో ఓ రైతు పంటపడింది. పొలంలో అతడికి విలువైన వజ్రం దొరికింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన రైతు పనుల నిమిత్తం పొలం వెళ్లగా.. ఆమెకు వజ్రం దొరికింది. ఈ విషయం తెలియడంతో వ్యాపారులు రైతును సంప్రదించారు. అతడికి రూ.8 లక్షలు ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశారు. ఇటీవలే జొన్నగిరికి చెందిన మరో రైతుకు వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లి నాణ్యతను చెక్ చేయించాడు. విలువైన వజ్రం అని తెలియక రూ.2 లక్షలకు ఓ వ్యాపారికి అమ్మేశాడు.. కానీ ఆ తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది.

ఈ వజ్రం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 10 లక్షల వరకు ఉంటుందని కొందరు వ్యాపారులు చెప్పారు. దీంతో రైతు తాను మోసపోయానని బాధపడ్డాడట. మళ్లీ వెళ్లి తాను వజ్రం అమ్మిన వ్యాపారిని ప్రశ్నించలేకపోయాడు. అనవసరంగా రూ.8 లక్షలు నష్టపోయానని బాధపడినా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే వజ్రాలు దొరికిన రైతులు అప్రమత్తం అవుతున్నారు.. ఒకటికి రెండుసార్లు వజ్రం గురించి ఆరా తీసిన తర్వాతే విక్రయిస్తున్నారు.

తొలకరి తర్వాత వర్షాలు మొదలుకాగానే కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలవుతుంది. పొలాలు, కొండల వెంట స్థానికులతో పాటూ చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా జనాలు వచ్చి గాలిస్తుంటారు. ఒక్క వజ్రమైనా దొరక్కపోదా.. తమ జీవితం మారకపోదా అన్న ఆశతో వజ్రాల వేటలో బిజీ అవుతున్నారు. ఈ సీజన్‌లో కూడా పలువురు రైతులు, కూలీలకు వజ్రాలు చిక్కాయి. కొన్ని వజ్రాలకు భారీ ధర పలికింది.. కొన్నిటికి రూ.5 లక్షల లోపే దక్కింది. అంతేకాదు ఈ వజ్రాలను దక్కించుకునేందుకు వ్యాపారులు కూడా అక్కడే మకాం పెట్టారు. వజ్రం దొరికిందని తెలిస్తే చాలు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు.

  • Read More Andhra Pradesh News And Telugu News

Related Articles

Back to top button