News

Joe Root,నేను ఆడ్తా రా.. నేనాడ్తా.. ఈసీబీని ఒప్పించి మరీ జట్టులో చోటు సంపాదించిన రూట్.. ఎలాగంటే! – joe root added to england squad for first odi against ireland at his own request


వన్డే వరల్డ్ కప్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న వేళ.. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ జో రూట్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. తనను జట్టులోకి ఎంపిక చేయకపోయినా.. పట్టుబడ్డి మరి చోటు సంపాదించాడు. తనకు మ్యాచ్ ప్రాక్టీసు కావాలంటూ పంతం నెగ్గించుకున్నాడు.

అసలేం జరిగిందంటే..
వన్డే వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్-ఐర్లాండ్ జట్లు మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనున్నాయి. ఇందుకోసం ఐర్లాండ్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరింది. సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 26 తేదీల్లో మ్యాచులు జరగనున్నాయి. అయితే ఇందుకోసం ఎంపిక చేసిన జట్టులో జో రూట్ లేడు. కానీ వన్డే వరల్డ్ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

అయితే ఇక్కడే జో రూట్.. ఓ ఆసక్తికర ప్రతిపాదనను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ముందుంచాడు. గత కొన్ని రోజులుగా ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్న రూట్.. తాను ఐర్లాండ్‌తో సిరీస్‌లో తొలి వన్డేలో ఆడతానని బోర్డుకు చెప్పాడు. ఈ మ్యాచును తాను ఫామ్‌లోకి వచ్చేందుకు ఉపయోగించుకుంటానని చెప్పుకొచ్చాడు. చెప్పడమే కాదు.. పట్టుబడ్డి తనను ఐర్లాండ్‌తో ఆడే జట్టులో భాగం చేయాలని డిమాండ్ చేశాడు.

దీంతో రూట్ తాపత్రయాన్ని అర్థం చేసుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. అతడిని ఐర్లాండ్‌తో తొలి వన్డే జట్టులో సభ్యుడిగా చేర్చింది. రూట్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కీలకమైన మెగా టోర్నీకి ముందు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో.. వన్డే వరల్డ్ కప్ జట్టులో సభ్యులుగా ఉన్నా.. పలువురు సీనియర్లను ఐర్లాండ్‌తో సిరీస్‌కు పక్కన బెట్టింది ఈసీబీ. కానీ రూట్ మాత్రం పట్టుబడ్డి జట్టులోకి వచ్చేశాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా రూట్.. చాలా రోజుల గ్యాప్ తర్వాత వన్డే మ్యాచులు ఆడాడు. అయితే ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 4 మ్యాచుల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐర్లాండ్‌తో సిరీస్‌ ద్వారా తిరిగి ఫామ్‌ను అందుకోవాలని రూట్ భావిస్తున్నాడు. తద్వారా వన్డే వరల్డ్ కప్‌లో కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడొచ్చని ప్లాన్‌తో ఉన్నాడు.

ఐర్లాండ్‌తో తొలి వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ టీమ్:
బెన్ డకెట్, జాక్ క్రాలే (కెప్టెన్), జో రూట్, ఫిలిప్ సాల్ట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, విల్ జాక్స్, ల్యూక్ వుడ్, బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్‌లే, జార్జ్ స్క్రిమ్‌షా, మాథ్యూ పాట్స్, సామ్ హెయిన్

Related Articles

Back to top button