News

Jobs: నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ఉచితంగా శిక్షణ ఆపై ఉద్యోగం. ఎలా అప్లై చేసుకోవాలంటే.. | Swamy ramananda tirtha trust offering free coaching and job offer for unemployment check for full details


విద్యను పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.? మీలాంటి వారి కోసమే తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సదవకాశాన్ని అందిస్తోంది. ఈ మంత్రిత్వ శాఖకు చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో..

విద్యను పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.? మీలాంటి వారి కోసమే తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సదవకాశాన్ని అందిస్తోంది. ఈ మంత్రిత్వ శాఖకు చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. శిక్షణతో పాటు ఉద్యోగం కూడా కల్పించనున్నారు. ఇంతకీ ఈ శిక్షణలో చేరడానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ అందించే ఈ శిక్షణ కార్యక్రమంలో అకౌంట్స్‌ అసిస్టెంట్‌ (ట్యాలీ), ఆటోమొబైల్‌ – 2, 3 వీలర్‌ సర్వీస్‌లో శిక్షణ అందిస్తారు. అకౌంట్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బికామ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అదే విధంగా ఆటోమొబైల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్ (గ్రా), పోచంపల్లి (మం),యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ – 508284 అడ్రస్‌లో సంప్రందిచాల్సి ఉంటుంది. అర్హతల ఒరిజనల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్‌తో పాటు పాస్ పోర్ట్ ఫొటోలు, ఆధార్ కార్డుతో మార్చి 1,2023 ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావాలి. పూర్తి వివరాల కోసం 9133908000, 9133908111, 9133908222, 9948466111 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button