jayavani, Actress Jayavani: గుర్తింపు కోసం ఆ సినిమాలు చేశా.. ఫొటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టారు: నటి జయవాణి – actress jayavani interesting comments about her film career
అప్పట్లో నా పేరు అందరికీ తెలియాలని అలాంటి పాత్రలు చేశా. ఇప్పుడు నాకు అంత అవసరం లేదు. ఇప్పుడు జయవాణి అంటే అందరికీ తెలుసు. గుర్తింపు కోసమే అలాంటి సినిమాలు చేశా. ఆ క్యారెక్టర్లు చేసిన మాత్రనా అందరూ అలా ఉండరు. విలన్ పాత్రలు చేసిన వారు బయట అలానే ఉండరు కదా. నేను అనుకున్న గోల్‌కు ఇంకా రీచ్ అవ్వలేదు. నా లక్ష్యాన్ని చేరుకునేందుకు నేనే ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సింది..’ అంటూ జయవాణి చెప్పుకొచ్చారు.
సినిమా అవకాశం ఉందని ఫొటోలు షూట్ తీసి ఇంటర్నెట్లో పెట్టి మోసం చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు జయవాణి. మూవీ ఛాన్స్ కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఫోన్ చేస్తే ఓ ఆఫీస్‌కు వెళ్లానని.. ఓ డ్రెస్‌లో తన ఫొటోలు తీసుకున్నారని చెప్పారు. వాళ్లు కొన్ని ఫొటోలు తీసుకున్న తరువాత అక్కడి నుంచి వచ్చానని.. మళ్లీ వాళ్లు తనకు ఇప్పటివరకు కాల్ చేయలేదన్నారు. కానీ కొద్ది రోజులకు ఆ ఫొటోలు ఇంటర్నెట్లో పెట్టారని.. ఆరా తీద్దామని వెళితే అక్కడ ఎవరూ లేరన్నారు. ఆ ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్ నెట్లో అలానే ఉన్నాయని.. ఎవరు పెట్టారో తనకు ఇప్పటికీ తెలియదన్నారు.