Entertainment

Telugu Indian Idol Season 2: దేశ సేవతో పాటు అద్భుతమైన టాలెంట్.. చక్రపాణి ప్రోమో విడుదల చేసిన ఆహా


ప్రతిభకు పట్టం కడుతూ ఎంతో మంది సింగర్స్ ను వెలుగులోకి తీసుకొస్తోంది ఆహా. తెలుగు ఇండియన్ ఐడిల్ కార్యక్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఎంతో మంది మంచి సింగర్స్ ను పరిచయం చేస్తోంది.

సూపర్ హిట్ సినిమాలు, అదిరిపోయే టాక్ షోలు, ఆకట్టుకునే గేమ్ షోలతో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ వినోదాన్ని అందిస్తోన్న ఓటీటీ సంస్థ ఆహా. వీటితో పాటే ప్రతిభకు పట్టం కడుతూ ఎంతో మంది సింగర్స్ ను వెలుగులోకి తీసుకొస్తోంది ఆహా. తెలుగు ఇండియన్ ఐడిల్ కార్యక్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఎంతో మంది మంచి సింగర్స్ ను పరిచయం చేస్తోంది. ఇప్పటికే విజయవంతంగా మొదటి సీజన్ ను పూర్తి చేసుకున్న తెలుగు ఇండియన్ ఐడిల్ ఇప్పుడు సెకండ్ సీజన్ తో అలరించడానికి రెడీ అయ్యింది. ఈ క్రమలోనే మరోసారి అద్భుతమైన గాత్రం ఉన్న సింగర్స్ ను పరిచయం చేసింది. అలా పరిచయమైన వారిలో చక్రపాణి ఒకరు.

దేశ సేవ చేసుకుంటూ తనలో ఉన్న మరో టాలెంట్ ను నిరూపించుకున్నాడు చక్రపాణి. అతని గాత్రానికి జడ్జ్ లు ఫిదా అయ్యారు. తాజాగా చక్రపాణికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. చక్రపాణి సింగింగ్ టాలెంట్ కు ఫిదా అయిన జడ్జ్ లు ఆడిషన్స్ లో అతడిని ఎంపిక చేశారు.. కానీ ఈ కార్యక్రమంలో కొనసాగడానికి చక్రపాణి నో చెప్పి షాక్ ఇచ్చాడు.

తనకు ఇచ్చిన సెలవలు పూర్తి అయ్యాయని తిరిగి సరిహద్దుకు వెళ్లే సమయం వచ్చిందని తెలిపాడు. జడ్జ్ తమన్ మీ ఆఫీసర్స్ తో మాట్లాడి ఏదైనా ఛాన్స్ ఉంటుందా అని అతడిని కొనసాగించే ప్రయత్నం చేశారు. మరి చక్రపాణి తెలుగు ఇండియన్ ఐడల్ లో కొనసాగుతాడా..? లేక తిరిగి సరిహద్దుకు వెళ్ళిపోతాడా అన్నది చూడాలి.

Related Articles

Back to top button