Faria abdullah: ఫరియా.. నిన్ను ఇలా చూసి ప్యార్ హోగయా.. మతిపోగొడుతోన్న ముద్దుగుమ్మ

తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు చాలానే ఉన్నారు. వారిలో ఈ చిన్నది కూడా ఒకరు. ఆమె ఫరియా అబ్దుల్లా. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన జాతిరత్నాలు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఫరియా అబ్దుల్లా. అందం అమాయకత్వం కలబోసిన ఈ చిన్నది నటనతోనూ మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా కు మంచి క్రేజ్ వచ్చింది. జాతిరత్నాలు సినిమా తర్వాత వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. జాతిరత్నాలు తర్వాత అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది.
ఆ తర్వాత కింగ్ నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సినిమా తర్వాత సంతోష్ శోభన్ తో కలిసి ఓ సినిమా చేసింది. అంతే ఆ తర్వాత ఇంతవరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో అనౌన్స్ చేయలేదు ఈ బ్యూటీ.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఫరియా అబ్దుల్లా చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫొటోలతో పాటు.. తన డాన్సింగ్ వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు మతి పోగొడుతున్నాయి. వయ్యారాలు వడ్డిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ చిన్నది. ఫరియా అబ్దుల్లా గ్లామరస్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram