Entertainment

Janhvi Kapoor: ఆ మాటలు విన్నప్పుడల్లా బాధేస్తుంది.. సినీ వారసత్వంపై జాన్వీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..


అలనాటి అందాల తార దివంగత నటి శ్రీదేవీ నట వారసత్వంతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్‌. సినీ బ్యాగ్రౌండ్‌ అండగా ఉన్నా ధడక్‌ వంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. తొలి సినిమాలోనే తనదైన నటనతో ప్రేమక్షకును మెస్మరైజ్‌ చేసింది. ఇక ఆ తర్వాత..

అలనాటి అందాల తార దివంగత నటి శ్రీదేవీ నట వారసత్వంతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్‌. సినీ బ్యాగ్రౌండ్‌ అండగా ఉన్నా ధడక్‌ వంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. తొలి సినిమాలోనే తనదైన నటనతో ప్రేమక్షకును మెస్మరైజ్‌ చేసింది. ఇక ఆ తర్వాత కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ దూసుకుపోతోంది.

సినిమాల్లో ఇప్పటి వరకు పెద్దగా గ్లామర్‌ పాత్రల్లో కనిపించని జాన్వీ.. సోషల్‌ మీడియాలో మాత్రం గ్లామర్‌ ఫొటోలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఇదిలా ఉంటే ఎంత కాదనుకున్నా జాన్వీ కపూర్‌ వారసత్వం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. జాన్వీకి సినీ నేపథ్యం కారణంగానే ఆఫర్స్‌ వస్తున్నాయనే వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా దీనిపై జాన్వీ కపూర్‌పై స్పందించింది. జాన్వీ కపూర్‌ తాజాగా నటించిన మిలీ అనే చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వారసత్వంపై ఓపెన్‌ అయ్యింది.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..’మంచి బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది కాబట్టే అవకాశాలొస్తున్నాయనే మాటలు విన్నప్పుడల్లా కొంచెం బాధగా అనిపిస్తుంది. సినీ నేపథ్యం రెండుమూడు అవకాశాల వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత టాలెంట్‌తో రాణించాల్సిందే. విమర్శకులకు సమాధానం చెప్పాలనే కసితో కష్టపడి పనిచేస్తుంటా. నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రతి రోజూ ఓ యుద్ధమే చేస్తున్నా’ అని చెప్పుకొచ్చింది జాన్వీ. ఇక విజయానికి ఎలాంటి షార్ట్‌కట్స్‌ ఉండవని, అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని నిరంతరం కృషి చేస్తే ఏదో రోజు విజయం మనల్ని వరిస్తుందని తనదైన ఫిలాసఫీ చెప్పుకొచ్చిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button