Entertainment

Viral: పాట వెనక అసలు కథ.. జంపలకిడి జారు మిఠాయా సింగర్‌ భారతీ చెప్పిన ఆసక్తికర విషయాలు..


పాటకు భాషతో సంబంధం లేదంటారు. మనకు తెలియని భాష పాటలు కూడా మనసుకు హత్తుకుంటాయి. అది సినిమా పాటే కానవసరం లేదు జానపదాలు కూడా కావొచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌, డీటిఎస్‌ మిక్సింగ్ ఉండాల్సిన అవసరం లేదు.. పల్లెల్లో పొలాల గట్టుల వద్ద పనిచేసుకుంటూ మహిళలు పాడే పాటల్లో..

Viral: పాట వెనక అసలు కథ.. జంపలకిడి జారు మిఠాయా సింగర్‌ భారతీ చెప్పిన ఆసక్తికర విషయాలు..

Jambalakidi Jaru Mitaya Singer

పాటకు భాషతో సంబంధం లేదంటారు. మనకు తెలియని భాష పాటలు కూడా మనసుకు హత్తుకుంటాయి. అది సినిమా పాటే కానవసరం లేదు జానపదాలు కూడా కావొచ్చు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌, డీటిఎస్‌ మిక్సింగ్ ఉండాల్సిన అవసరం లేదు.. పల్లెల్లో పొలాల గట్టుల వద్ద పనిచేసుకుంటూ మహిళలు పాడే పాటల్లో జీవిత సారాన్ని విప్పి చెప్పే చరణాలు ఎన్నో ఉంటాయి. అలా జానపద పాటలకు మన తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. ఒకప్పుడు పెద్దగా ప్రపంచానికి పరిచయం కానీ ఇలాంటి పాటలు ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఫోక్‌ సాంగ్స్‌కు ఉన్న హవా చూస్తేనే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి ఓ జానపద గీతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

మంచి విష్ణు హీరోగా తెరకెక్కిన జిన్నా మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో భారతీ అనే మహిళ పాడిన.. ‘జంపలకిడి జారు మిఠాయా’ పాట సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. మొదట్లో ఈ పాటకున్న ప్రాముఖ్యత తెలియక చాలా మంది నెగిటివ్‌ కామెంట్స్‌, ట్రోలింగ్‌ చేశారు. అయితే పోను పోనూ ఈ సాంగ్‌ అర్థం తెలుసుకొని, ఆ పాట పాడిన వారి నేపథ్యం తెలుసుకోవడం ప్రారంభించారు. దీంతో ఈ పాట పాడిన వారికి ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగింది. తాజాగా ఆనంద్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రమోషన్‌కు సింగర్‌ భారతీని రంగంలోకి దింపారంటేనే ఈమెకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ భారతీ ఎవరు.? అసలు వీరిది ఏ గ్రామం.? వీరి పాటల వెనక ఉన్న కథేంటని చాలా మంది వెతకడం ప్రారంభించారు.దీంతో కొందరు యూట్యూబ్‌ చానల్స్‌ ఆమె కోసం తెగ వెతికి మరీ ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారతీ తమ పాటకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఆమె చెప్పిన ఆ విషయలేంటంటే.. భారతీ స్వగ్రామం తిరుపతి దగ్గర ఉండే వెంకటగిరికి సమీపంలో ఉన్న పారువోలు గ్రామం. ఈ ప్రాంతానికే పరిమితమైన ఈ జానపాద పాటల గురించి తెలిసిన మోహన్‌ బాబు తమను పాట పాడమని కోరారని భారతీ తెలిపారు. ఇక తమను ట్రోల్‌ చేసే వారికి భారతీ ధన్యవాదాలు తెలపడం గమనార్హం. అలా ట్రోల్ చేసే వారి వల్ల తనకు ఇంత పేరు వచ్చిందని తడుముకోకుండా చెప్పుకొచ్చారు. కుగ్రామంలో నివసిస్తోన్న ఓ మహిళ ట్రోలింగ్‌పై స్పందించిన తీరుకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. సినిమాలో పాట పాడినందుకు తనకు రూ. 50 వేలతో పాటు కొత్త దుస్తులు పెట్టారని భారతి చెప్పుకొచ్చారు. మోహన్‌ బాబు స్వయంగా తన చేతుల మీదుగా డబ్బులు, దుస్తులు అందించడం విశేషం. సినిమాల్లో పాటలు పాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే సాంగ్స్‌ను రాయగలనని భారతి తెలిపారు.

Advertisement

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండిలేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button