News

jagananna cheyutha, సీఎం జగన్ గుడ్ న్యూస్.. 3.95 లక్షల మంది అకౌంట్లలో రూ.395 కోట్లు! – cm ys jagan mohan reddy will distribute jagananna cheyutha


ఆంధ్రప్రదేశ్‌లోని చిరు వ్యాపారులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిరు వ్యాపారులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా బుధవారం సీఎం జగన్ లబ్ధిదారులకు కొత్త రుణాలను అందించనున్నారు. ఈ పథకం కింద పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.

జగనన్న తోడు పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందించనున్నారు. అలాగే, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఎవరెవరు అర్హులంటే..
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడగులు పొడవు, 5 అడుగులు వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. అలాగే పుట్‌పాత్‌లపై, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్‌, మోటారు సైకిల్‌, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసేవారితో పాటు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు.. ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బమ్మల తయారీ, లేస్‌ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారు ఈ పథకానికి అర్హులని అధికారులు తెలిపారు.

Related Articles

Back to top button