It Hiring,TCS: ఐటీ కంపెనీలు ఇంత పనిచేస్తున్నాయేంటి? ఉద్యోగుల్లో అదే ఆందోళన.. ఇక వారికి కూడా కష్టమే! – tcs, infosys, wipro: it firms may hire 30 percent less in fy24, delays in freshers onboarding persist
2021 నుంచి 2022 సెప్టెంబర్- అక్టోబర్ మధ్యలో కూడా ఇన్ఫీ, విప్రో, TCS, HCL, కాగ్నిజెంట్, అసెంచర్ వంటి దిగ్గజ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కూడా చాలా మందిని ఎంపిక చేశాయి. అయితే ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు అంతా మారిపోయింది. చాలా మందికి దిగ్గజ కంపెనీలు ఆఫర్ లెటర్స్ ఇచ్చినా.. ఇంకా ఉద్యోగంలోకి రావాలని చెప్పట్లేదు. వారి ఆన్‌బోర్డింగ్స్‌ను వాయిదా వేస్తూ పోతూనే ఉంది. కొందరు దాదాపు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ ఉద్యోగంలో చేరాలా? వేరే ఏదైనా ట్రైనింగ్ తీసుకొని ప్రయత్నించాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారు.
డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎంల్లో ఇలా క్యాష్ విత్‌డ్రా చేయొచ్చు తెలుసా? చేతిలో మొబైల్ ఉంటే చాలు!
ఇప్పుడు మాత్రం మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దిగ్గజ ఐటీ కంపెనీలు ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల నియామకాలను భారీగా తగ్గించాయట. డిమాండ్ అంతలా లేకపోవడం, మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి నియామకాల్లో 30 శాతం తగ్గుదల ఉండనున్నట్లు ప్రముఖ స్టాఫింగ్ ఫర్మ్ టీమ్‌లీజ్ డిజిటల్ వెల్లడించింది.
ఇదే క్రమంలో నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు బ్యాచ్‌ల నుంచి సుమారు 20-25 వేల మంది వరకు ఫ్రెషర్లలో ఆన్‌బోర్డింగ్ జాప్యం జరుగుతోందని తమకు ఫిర్యాదులు అందినట్లు వివరించారు. అసలు డిమాండ్ లేనప్పుడు ఇంత మందికి ఆఫర్ లెటర్స్ ఎందుకు జారీ చేశాయని ఆయన ప్రశ్నించారు.
మీ పిల్లల చదువు, పెళ్లి కోసం రూ. 50 లక్షలు కావాలా.. మరి ముందు నుంచే ఇలా ప్లాన్ చేసుకోండి!
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఈ లిమిట్ దాటితే 20 శాతం TCS.. లిస్ట్‌లో క్రెడిట్ కార్డులు, విదేశీ పెట్టుబడులు!
Read Latest Business News and Telugu News