News

Isha Ambani Twins Birth Day Celebrations,ఇషా అంబానీ పిల్లల తొలి పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్‌గా.. హాజరైన ప్రముఖులు – isha ambani twins aadiya and krishna first birthday clebrations at jio world in mumbai, celebrities arrived


రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమిల్ దంపతుల కవల పిల్లలైన.. ఆదియా, కృష్ణల తొలి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముంబయిలో జరిగిన ఈ గ్రాండ్ పార్టీకి ముఖేష్ అంబానీ, నీతా అంబానీలతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు హాజరై.. చిన్నారులను ఆశీర్వదించారు. అయితే.. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. తమ మనవడు, మనవరాలిని ముఖేష్ అంబానీ దంపతులు ముద్దు చేస్తున్న ఫొటోలు, వీడియోలను.. నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

ఈ పార్టీకి షారుక్‌ ఖాన్, కత్రినా కైఫ్, అనన్యా పాండే, కరణ్ జోహార్, రూహి, యష్‌ హాజరయ్యారు. క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్య , భార్య నటాషాతో పాటు సోదరుడు క్రునాల్‌తో కలిసి హాజరయ్యారు. కియారా అద్వానీ తన తల్లితో కలిసి ఈ పార్టీకి వచ్చారు. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ కూడా తన ఇద్దరు పిల్లలతో పార్టీకి హాజరయ్యారు.

అయితే.. ఇషా అంబానీకి, ప్రముఖ పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్, స్వాతి పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమిల్‌తో 2018 డిసెంబర్ 12న వివాహం జరిగింది. ఈ దంపతులు గతేడాది నవంబర్ 19న తల్లిదండ్రులయ్యారు. వీరికి కవలలు జన్మించగా.. ఆదియా, కృష్ణలుగా నామకరణం చేశారు.

Related Articles

Back to top button