Entertainment

The Legend: ఇన్నాళ్లు ఓటీటీకి లెజెండ్ శరవణన్ రాకపోవడానికి కారణం ఇదేనా..?


The Legend

చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులు తిరగక ముందే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. అయితే ఒక సినిమా మాత్రం ఓటీటీ రిలీజ్ కు చాలా టైం తీసుకుంది. పోనీ అది ఓ స్టార్ హీరో సినిమా అంటే అదీ కాదు.. అలాగని చిన్న సినిమానా అంటే కాదు.. ఇంతకు ఆ సినిమా ఏదని అనుకుంటున్నారా.? ఆ సినిమానే ది లెజెండ్. శరవణన్ మొన్నా మధ్య ఈ పేరు తెగ హల్ చల్ చేసింది. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఐదుపదుల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు లెజెండ్ శరవణన్. హీరో అవ్వాలనే కలను చాలా  ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నారు శరవణన్.

ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్  స్టోర్స్ అధినేత అయిన శరవణన్  గతంలో తన బ్రాండ్ కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డారు. ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్‌ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్‌ పుట్ తో.. థియేటర్లలో రిలీజ్‌ చేశారు. 2022 జులై 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే  ఈ సినిమా ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. తన సినిమాను ఓటీటీ రిలీజ్ చేసేందుకు శరవణన్ ఇష్టపడలేదని తెలుస్తోంది. తన సినిమాకు ఆశించిన స్థాయిలో ఓటీటీ రైట్స్ రాకపోవడంతో తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు శరవణన్ ఇష్టపడలేదట. మొత్తానికి ఇప్పుడు సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు శరవణన్.  ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లెజెండ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం

Related Articles

Back to top button