Entertainment

Mahesh Babu: మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి పూజాహెగ్డే తప్పకుందా..? కారణం ఇదేనా..


దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. అతడు, ఖలేజా లాంటి సినిమాల తరవాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. అతడు, ఖలేజా లాంటి సినిమాల తరవాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఇప్పుడు పక్క యాక్షన్ ఎంటర్టైనర్ తో .ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మహేష్ , త్రివిక్రమ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మహేష్ ఇంట వరుస విషాదాలు నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ పడింది. త్వరలోనే మహేష్ తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నారు.ఇటీవలే మహేష్ విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చారు. ఫిబ్రవరిలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు.

అయితే మహేష్ ఏకధాటిగా 60 రోజులు షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. మహేష్ తో మొదటి యాక్షన్ ఎంటర్ టైనర్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కథలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.

ఇవి కూడా చదవండి

మహేష్ సినిమా కథ మొత్తాన్ని మార్చేశారట త్రివిక్రమ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే ను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు పూజాను కూడా మార్చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే పూజ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఈ అమ్మడిని తీసుకోవడం పై మహేష్ అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో పూజాహెగ్డే డేట్స్ కూడా అడ్జెస్ట్ అవ్వడం కష్టంగా మారడంతో ఆమె ఈ సినిమానుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే త్వరలోనే మరో హీరోయిన్ పేరు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button