IPR Gandhinagar Jobs: గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్‌లో సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఇలా ఎంపిక చేస్తారు.. | Institute for Plasma Research Gandhinagar Recruitment 2023 for 51 Scientist Assistant Posts, check details
కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్.. 51 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్.. 51 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ విభాగాల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా/బీఎస్సీలేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. స్క్రీనింగ్ టెస్ట్/రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారిక నెలకు రూ.35,400లతో పాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.