News

ipl 2023, RCB vs GT: బెంగళూరుకి చావోరేవో మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ – royal challengers bangalore vs gujarat titans ipl 2023 match toss updates from bengaluru


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇస్తుండగా.. వర్షం కారణంగా మ్యాచ్ అరగంట ఆలస్యంగా స్టార్ట్ అవుతోంది. ఐపీఎల్ 2023 సీజన్‌ లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్‌కాగా.. బెంగళూరు ప్లేఆఫ్స్‌కి చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోతే.. అప్పుడు ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కి వెళ్తుంది.. బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తుని ఖాయం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ టీమ్ ఈరోజు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ.. బెంగళూరు టీమ్‌లో మాత్రం ఒక మార్పు జరిగింది. కర్ణ్ శర్మ స్థానంలో హిమాన్షు శర్మ వచ్చాడు. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ టీమ్ 18 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. బెంగళూరు టీమ్ 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

బెంగళూరు టీమ్: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), మైకేల్ బ్రాస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లూమర్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్

గుజరాత్ టైటాన్స్: సాహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దసున్ శనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, యశ్ దయాల్

Related Articles

Back to top button