News

ipl 2023 qualifier 2, GT vs MI: గుజరాత్‌పై టాస్ గెలిచిన ముంబయి.. గెలిస్తే నేరుగా ఫైనల్‌కి – gujarat titans vs mumbai indians ipl 2023 qualifier 2 match toss updates from ahmedabad


గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరుగుతున్న ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ -2 (IPL 2023 Qualifier 2 ) మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా ముప్పావు గంట ఆలస్యంగా టాస్ పడగా.. అరగంట లేటుగా మ్యాచ్ ప్రారంభమవుతోంది. ముంబయి ఇండియన్స్ తుది జట్టులో ఒక మార్పు చేసినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. షూకెన్ స్థానంలో కుమార్ కార్తికేయ జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ టీమ్‌లో రెండు మార్పులు చేసినట్లు టాస్ టైమ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించాడు. షనక స్థానంలో జాషువా లిటిల్, నల్కండే స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు.

గుజరాత్ టైటాన్స్: సాహా (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ

ముంబయి ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్దాన్, పీయూస్ చావ్లా, జేసన్ బెరండ్రాఫ్, కుమార్ కార్తికేయ, అకాశ్ మధ్వాల్


ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 3 సార్లు ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడగా.. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో ముంబయి విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో గుజరాత్ గెలిచింది. ముంబయి ఇండియన్స్ టీమ్ చివరిగా ఆడిన మ్యాచ్‌(ఎలిమినేటర్)‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ టీమ్ క్వాలిఫయర్ -1 మ్యాచ్‌లో గత సోమవారం 15 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.

ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లి చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం టైటిల్ పోరులో తలపడనుంది. అయితే ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో యావరేజ్ స్కోరు 187 పరుగులుకాగా.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలానే ఛేదనకి దిగిన జట్టు కూడా 3 మ్యాచ్‌ల్లో గెలిచింది.

Related Articles

Back to top button