News

IPL 2023, GT vs SRH: చేధనలో చేతులెత్తేసిన ఆరెంజ్ ఆర్మీ.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ నుంచి ఔట్.. – Telugu News | IPL 2023: Gujarat Titans Beat Sunrisers By 34 Runs and Hyderabad Eliminated from Tourney Playoffs


IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టీమ్ మరో సారి అద్భుతంగా అదరగొట్టింది. 34 పరుగులతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను ఓడించడమే కాక ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన ఆరెంజ్..

IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టీమ్ మరో సారి అద్భుతంగా అదరగొట్టింది. 34 పరుగులతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను ఓడించడమే కాక ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన ఆరెంజ్ ఆర్మీ  ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజారత్ టైటాన్స్ తరఫున శుభ్‌మ‌న్ గిల్(101) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో ఆ టీమ్ 9 వికెట్ల న‌ష్టానికి 188 ప‌ర‌గులు కొట్టింది. అలాగే ఈ టీమ్ తరఫున సాయి సుదర్శన్(47) పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్‌కి 5 వికెట్లు.. మార్కో యాన్సన్, ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 189 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన సన్‌రైజర్స్ టీమ్ పూర్తిగా చేతులెత్తేసింది. హెన్రిచ్ క్లాసెన్(64), భువనేశ్వర్(27), మయాంక్ మార్ఖండే(18, నాటౌట్) మినహా మిగిలినవారంతా చెత్తగా ఆడారు. ముఖ్యంగా టీమ్ కెప్లెన్ మార్క్రమ్ అయితే కీలక మ్యాచ్‌లో 10 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక గుజరాత్ బౌలర్లలో మొహమ్మద్ షమి, మోహిత్ శర్మ చెరో 4 వికెట్లు పడగొట్టగా.. యష్ దయాల్ ఒకరిని ఔట్ చేశాడు.

ఇవి కూడా చదవండి



ఇరు జట్ల వివరాలు:

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, టి నటరాజన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button