IPL 2023: బెంగళూరుని ఇంటికి సాగనంపిన గుజరాత్.. ప్లేఆఫ్స్‌కు ముంబయి – Telugu News | Gujarat Titans eliminates Royal Challengers Bengaluru, Mumbai Joins in Playoffs
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలయ్యింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలి. కానీ చివరికి గుజరాత్ చేతిలో ఓడిపోయి ప్లేఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది . దీంతో 8 విజయాలు సాధించిన ముంబయి ఇండియన్స్ జట్టు ఫ్లేఆఫ్స్‌కు వెళ్లిపోయింది.
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలయ్యింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలి. కానీ చివరికి గుజరాత్ చేతిలో ఓడిపోయి ప్లేఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది . దీంతో 8 విజయాలు సాధించిన ముంబయి ఇండియన్స్ జట్టు ఫ్లేఆఫ్స్‌కు వెళ్లిపోయింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభమాన్ గిల్(104*) పరుగుల చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. విజయ శంకర్(53) పరుగులు చేశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (101*) సెంచరీతో అదరగొట్టాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, షమీ, దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఎలాగైన ఈసారి కప్పు కొట్టాలనే ఆర్సీబీ కోరిక మళ్లీ కలగానే మిగిలిపోయింది
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..