News

IPL 2023: ఒక్క పరుగు తేడాతో కోల్‌కతాపై విజయం సాధించిన లక్నో సూప‌ర్ జెయింట్స్ – Telugu News | Lucknow Super Giants survive Rinku Singh scare to eliminate Kolkata Knight Riders and enters playoffs


ఐపీఎల్‌ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అద‌ర‌గొట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఒక్క ప‌రుగు తేడాతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కు దూసుకుపోయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.

ఐపీఎల్‌ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అద‌ర‌గొట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఒక్క ప‌రుగు తేడాతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కు దూసుకుపోయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌ (45; 28 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్ (24; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం ఇవ్వడంతో కోల్‌కతా సునాయసంగా విజయం సాధించేలా కనిపించింది.

కానీ లక్నో బౌలర్లు మాత్రం అనుహ్యంగా పుంజుకుని వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై పట్టు సాధించారు. చివర్లో రింకు సింగ్ (67*; 33 బంతులలో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) గట్టిగా పోరాడినప్పటికీ జట్టును విజయం అందించలేకపోయాడు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌, శార్దూల్ ఠాకూర్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కృనాల్‌ పాండ్య, గౌతమ్‌ చెరో వికెట్‌ తీశారు.

అయితే మొదటగా బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (28; 27 బంతుల్లో), ప్రేరక్ మన్కడ్ (26; 20 బంతుల్లో), ఆయుష్‌ బదోని (25; 21 బంతుల్లో) పరుగులు చేయగా.. చివర్లో నికోలస్ పూరన్ (58; 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అదరగొట్టాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, వైభవ్‌ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button