News
IPL 2023లో ముగిసిన పంజాబ్ కథ.. గెలిచినా రాజస్థాన్‌కి కష్టమే – rajasthan royals beat punjab kings by 4 wickets in ipl 2023
188 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ టీమ్‌కి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జోస్ బట్లర్ (0) డకౌటయ్యాడు. కానీ.. సూపర్ ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (50: 36 బంతుల్లో 8×4), నెం.3లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (51: 30 బంతుల్లో 5×4, 3×6) నిలకడగా ఆడి రెండో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ.. టీమ్ స్కోరు 85 వద్ద పడిక్కల్ ఔటైపోగా అనంతరం వచ్చిన సంజు శాంసన్ (2) నిరాశపరిచాడు. కానీ చివర్లో సిమ్రాన్ హెట్‌మెయర్ (46: 27 బంతుల్లో 4×4, 3×6) దూకుడుగా ఆడి రాజస్థాన్‌ని గెలుపు తీరాలకి చేర్చి 179 పరుగుల వద్ద ఔటైపోయాడు. రాజస్థాన్ విజయానికి చివరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం అవగా.. రాహుల్ చాహర్ బౌలింగ్ చేశాడు. లాస్ట్ ఓవర్‌లో సిక్స్ బాదిన ధ్రువ్ జురెల్ (10 నాటౌట్: 4 బంతుల్లో 1×6) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.
మ్యాచ్‌లో అంతకముందు శామ్ కరన్ (49 నాటౌట్: 31 బంతుల్లో 4×4, 2×6), షారూక్ ఖాన్ (41 నాటౌట్: 23 బంతుల్లో 4×4, 2×6), జితేశ్ శర్మ (44: 28 బంతుల్లో 3×4, 3×6) ఫర్వాలేదనిపించడంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 5 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ 3 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీశారు.