News

intinti gruhalakshmi today episode, Intinti Gruhalakshmi: లాస్య బండారం బయటపెట్టిన తులసి.. నందు ఉగ్రరూపం – intinti gruhalakshmi nandu fires on lasya over anasuya and parandhamaiah issue


నందుని ఓ చేతకాని కొడుకులా చూసినప్పటికీ.. అతనికి తల్లిదండ్రులంటే గౌరవం. వాళ్లపై ఈగవాలినా తట్టుకోలేడు. అయితే అత్త మామల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నందు దగ్గర నటిస్తున్న లాస్య.. కనీసం వాళ్లకి తిండికూడా పెట్టకుండా హింసపెడుతుంది. అయితే విషయం కొడుక్కి తెలిస్తే.. ఎక్కడ లాస్యని వదిలేస్తాడనే ఉద్దేశంతో నందు దగ్గర గుట్టుగానే ఉంటున్నారు పరంధామయ్య, అనసూయలు. అయితే లాస్య.. తన అత్త మామలకు తిండి పెట్టకుండా ఇబ్బందుల పాలు చేస్తుందనే నిజం తెలుసుకున్న తులసి.. లాస్య ఆటకట్టించేందుకు రెడీ అయ్యింది. అంతకు ముందు ఏమైందో ఈ కింది లింక్‌లో చూడొచ్చు.

Read Also: ఇంటింటి గృహలక్ష్మి జనవరి 05 ఎపిసోడ్: లాస్యతో చేతులు కలిపిన బెనర్జీ.. ఈ స్కెచ్‌లో నందు కూడా

లాస్య నాటకాన్ని బట్టబయలు చేయడానికి నేరుగా ఇంటికి వెళ్లింది. తన వాళ్ల కోసం కొన్ని సామాన్లు తీసుకుని వెళ్తుంది తులసి. తన భజన బ్యాచ్ అంతా వచ్చి.. ఆశ్చర్యంగా తులసిని చూస్తూ ఉంటారు. ‘ఏంటి అంతా అలా చూస్తున్నారు.. మీ ఇంటికి గెస్ట్ వచ్చింది.. కాస్త మంచినీళ్లు కూడా ఇవ్వరా’? అని అంటుంది తులసి. ఇంతలో లాస్య సీన్‌లోకి వస్తుంది.

‘ఈ సరుకులు ఏంటి? ఈ హంగామా ఏంటి? అసలు మా ఇంట్లోకి సరుకులు తీసుకుని రావడానికి నువ్వెవరు? మా ప్లానింగ్ మాకు ఉంటుంది.. మా ఖర్చులు మాకు ఉంటాయి.. మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి? ఎవరు అడిగారు? ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్’ అని అరుస్తుంది లాస్య. దీంతో తులసి.. ఈ సరుకులు నా డబ్బులతో నా వాళ్ల కోసం నేనే తీసుకుని వచ్చాను. ఎవ్వర్నీ అడగలేదు.. నేను ఇంటికి ఇవి తెచ్చేవరకూ ఇక్కడ ఉన్న వాళ్లకి కూడా తెలియదు’ అని సమాధానం ఇస్తుంది తులసి.

ఇంతలో నందు వచ్చి.. ‘ఈ ఇంటికి సామాన్లు తీసుకుని రావాల్సిన అవసరం నీకేంటి? జాలి చూపిస్తున్నావా? కాకా పడుతున్నావా? అని అరుస్తాడు నందు. ఆ మాటతో తులసి. ‘నా వాళ్లు ఈ ఇంట్లో తిండికి ఇబ్బంది పడకూడదని జాగ్రత్త పడుతున్నా అని అంటుంది తులసి. ఈ ఇంట్లో తిండిలేక బాధపడుతున్నారని ఎవరు చెప్పారు నీకు.. మా అమ్మానాన్నలను చూసుకోలేనంత చేతకాని వాడ్ని అనుకుంటున్నావా? అసలు ఏంటి నీ ఉద్దేశం? మర్యాదగా వాటిని తీసుకుని వెళ్లు.. లేకపోతే బయటకు విసిరేస్తా’? అని అంటాడు నందు.

నా పిల్లలు, అత్తమామల కోసం నేను సరుకులు తీసుకుని వస్తే తప్పేంటి? అని తులసి అనడంతో… ‘అంటే నేను వీళ్లని పట్టించుకోవడం లేదని చెప్తున్నావా? .. అని అంటాడు నందు. ‘ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు ఇప్పుడే మీ కళ్ల ముందు ఉంచుతాను’ అని అంటుంది తులసి. దీంతో లాస్య.. ‘ఇది నా బండారం బయటపెట్టడానికే వచ్చింది. అర్జెంట్‌గా తప్పించుకోవాలని అనుకుని.. మా ఇంట్లో గొడవలు పెట్టడానికే వచ్చావా? అని అంటుంది. దీంతో నందు.. ‘అడ్డుపడకు లాస్య.. తను ఏదో చూపిస్తాను అని అంటుంది కదా.. చూపించనియ్’ అని అంటాడు.

ఆ మాటతో తులసి.. ‘ఎందుకు లాస్య అంత కంగారు పడుతున్నావ్’.. అని తులసి అంటే.. ‘నాకు కంగారు ఏంటి?’ అని మాట దాటేస్తుంది. ఇంతలో తులసి.. శ్రుతిని పిలిచి.. ‘నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వగలవా? ’ అని అంటుంది. అప్పుడు లాస్య బండారం ఒక్కొక్కటిగా బయటపెడతారు తులసి అండ్ కో బ్యాచ్. లాస్య.. వంటగదిలో ఫ్రిడ్జ్‌తో సహా.. అన్నింటికీ తాళాలు వేసిందని.. లాస్య గురించి చెప్పడంతో నందు తోక తొక్కిన తాచులా లాస్యపై లేస్తున్నాడు. ఇక తులసికి ఏమైందో ఏమో కానీ.. కళ్లు తిరిగిపడిపోతుంది. ఆ వివరాలు రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.

Advertisement

Related Articles

Back to top button