Intinti Gruhalakshmi, Indraneil Varma: నిజమే.. అది జనానికి నచ్చట్లేదు.. మార్పులతో మళ్లీ వస్తున్నా: ‘గృహలక్ష్మి’ సామ్రాట్ స్పందన – intinti gruhalakshmi samarat aka indraneil varma says i will come back very soon
కాగా సామ్రాట్.. అనే పాత్ర గత రెండు వారాలుగా కనిపించకపోవడంతో.. ‘సమయం తెలుగు’లో కథనం వచ్చింది. ‘గృహలక్ష్మి’ సీరియల్ నుంచి సామ్రాట్ ఔట్.! తన పాత్రని డమ్మీ చేసినందుకేనా? మళ్లీ వస్తాడా? అంటూ ప్రత్యేక కథనం రావడంతో ఇంద్రనీల్ స్పందిస్తూ.. కీలక అప్డేట్ ఇచ్చారు.
ETimesతో మాట్లాడిన ఇంద్రనీల్.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కథలో మార్పులు చేర్పుల కారణంగా.. షూటింగ్‌కి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పిన ఆయన.. త్వరలో మళ్లీ ‘గృహలక్ష్మి’ సీరియల్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. వచ్చే వారాతం నుంచి షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నానని.. ఈ గ్యాప్ ఉద్దేశపూర్వంగా వచ్చింది కాదని చెప్పారాయన. తులసికి జోడీగా ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోందని.. ప్రేక్షకులకు కథను కనెక్ట్ చేసేందుకు గానూ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు చెప్పారు ఇంద్రనీల్.
మొత్తానికి తులసితో సామ్రాట్ లవ్ ట్రాక్ బెడిసికొట్టడంతో.. నష్టనివారణ చర్యల్లో భాగంగా కథలో మార్పులు చేయబోతున్నారట మేకర్. నిజానికి ఇంటింటి గృహలక్ష్మి ఒరిజినల్ వెర్షన్ బెంగాలీ సీరియల్ శ్రీమోయి (Sreemoyee)లో తులసికి రెండోసారి పెళ్లి అవుతుంది. ఫ్యామిలీ వదిలి వచ్చేసిన తరువాత సామ్రాట్ లాంటి వ్యక్తిని పెళ్లాడుతుంది. ఇక హిందీ వర్షన్‌లో కూడా రెండోసారి పెళ్లాడుతుంది. కానీ తెలుగులో మాత్రం.. పరిస్థితులు వేరు.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అని ప్రేక్షకులకు అనిపించేట్టుగా కథనం నడిపించాలి. జనం కోరుకోవాలి.. వాళ్ల పెళ్లిని ప్రేమని. కానీ రావడం రావడమే ఈ ముదురు జంటని బీచ్‌లోకి తీసుకుని వెళ్లి.. ‘ఈనాడే ఏదో అయ్యింది’ అంటూ రొమాన్స్ చేయించడంతో.. ఇదేం దరిద్రంరా బాబూ అని ఛీ కొట్టారు. ఇప్పుడు కళ్లు తెరిచి.. ఆ సోది యవ్వారాలకు కత్తెరేసి.. కథలో మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ‘గృహలక్ష్మి’ సరికొత్తగా రాబోతుందట. మరి ఈసారి సామ్రాట్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో.. తులసితో ఇతని ట్రాక్ ఎలా చూపించబోతున్నారో చూడాలి మరి.