Entertainment

Bigg Boss Telugu: సిరి-శ్రీహాన్‌ల కొడుకు గురించి బయట ప్రచారం అంతా తప్పే.. ఇదిగో అసలు క్లారిటీ


బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో ప్రజంట్ ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకువస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్‌గా సాగుతున్నాయి. తాజాగా శ్రీహాన్ కోసం సిరి లోపలికి వచ్చింది.

శ్రీహాన్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి సిరి ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో ఓ బాబు సైతం లోపలికి వచ్చాడు. ఆ చిన్నోడు సిరిని మమ్మీ అంటున్నాడు. శ్రీహాన్‌ను డాడీ అని పిలిచాడు. ఆ బుడతడ్ని ఎత్తుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు శ్రీహాన్. ఆ బుడ్డోడు అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందర్నీ ఇమిటేట్ చేస్తూ సూపర్ ఫన్ అందించాడు. ఆడుతూ పాడుతూ చాలా యాక్టివ్‌గా కనిపించాడు. బయట శ్రీహాన్‌, సిరిలు ఒకేచోట ఉంటున్నారు కానీ.. వారికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మరి ఈ బుడతడు ఎవరు అని చాలామందికి డౌట్ వచ్చింది. ఆ బాబు అనాథ అని.. లేదు ఆ బాబు పేరెంట్స్ పేదరికంలో ఉండటంతో సిరి ఆ చిన్నోడుని దత్తత తీసుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ రూమర్సే.

సిరి, శ్రీహాన్ దత్తత తీసుకుని పెంచుకుంటున్న ఈ చిన్నోడి పేరు చైతు. అయితే ఆ బాబు బయట వ్యక్తి కాదు. సిరి మేనమామ కొడుకు.  ఈ విషయాన్ని స్వయానా సిరి తల్లి శ్రీదేవి గతంలో వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 5లో సిరి ఇంట్లో ఉన్నప్పుడు లోపలికి వెళ్లారు ఆమె తల్లి శ్రీదేవి. ఆపై బయటకు వచ్చిన ఆమె చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడు ఈ చిన్నోడి ప్రస్తావన వచ్చింది. సిరి పెంచుకుంటున్న బాబు ఎవరో కాదు.. మా తమ్ముడి కొడుకే అంటూ సిరి శ్రీదేవి అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.

గతంలో బిగ్ బాస్ సీజన్ 5 ఇంట్లో ఉన్నప్పుడే..  సిరి కూడా ఈ బాబు గురించి చెప్పుకొచ్చింది. కావాలంటే ఆ సీజన్ 51వ ఎపిసోడ్‌ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తనకు ఓ బాబు ఉన్నాడని.. తనకు పుట్టకపోయినా..  కొంతకాలంగా తన దగ్గరే ఉన్నట్లు వెల్లడించింది. చైతూని తాను కనకపోయినా.. చాలా బాండింగ్ ఉందని వెల్లడించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button