Entertainment

Mahesh Babu: మహేష్ బాబు.. రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్.. అదేంటంటే..


ఈ చిత్రానికి అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు పెట్టని ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఈ చిత్రానికి అమరావతికి అటు ఇటు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆరంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను సెట్ చేస్తున్నారట రాజమౌళి టీమ్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఇటీవలే విదేశాలకు వెళ్లిన మహేష్ హైదరాబాద్ తిరిగి వచ్చారు. త్వరలోనే త్రివిక్రమ్ తెరకెక్కించే ప్రాజెక్ట్ కంప్లీట్ కానుందని టాక్.

ఈ సినిమా తాజా షెడ్యూల్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుందట. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ చేయనున్నారట.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button