Best Company:టైమ్ మ్యాగజైన స్టాటిస్టాతో కలిసి ప్రపంచంలో 100 బెస్ట్ కంపెనీల జాబితా- 2023ని శుక్రవారం విడుదల చేసింది. బెస్ట్ 100 కంపెనీల్లో ప్రముఖ టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత నాలుగు స్థానాల్లో యాపిల్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, మెటా ప్లాట్‌ఫామ్స్ నిలిచాయి. అయితే మన భారత దేశం నుంచి టాప్100లో ఒకే ఒక్క కంపెనీ స్థానం దక్కించుకుంది. ఆ కంపెనీ ఏది? టైమ్స్ జాబితాలో దాని ర్యాంక్ ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచ అత్యుత్తమ 100 కంపెనీల జాబితాలో భారత్ నుంచి దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ నిలిచింది. ఈ కంపెనీ 64వ స్థానాన్ని దక్కించుకుంది. ఇన్ఫోసిస్ కంపెనీని 1981లో ఏడుగుు యువ ఇంజినీర్లు కలిసి స్థాపించారు. అందులో ఇన్ఫోసిస్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, నందన్ నీలేకని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారితో పాటు కంపెనీ వ్యవస్థాపకుల్లో ఎస్.డి.శిబులాల్, గోపాలకృష్ణన్, అశోక్ అరోడా, కె.దినేశ్, ఎన్ఎస్ రాఘవన్ ఉన్నారు. 2020 నాటికి కంపెనీల ఆదాయాల ప్రకారం చూసుకుంటే మన దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది ఇన్ఫోసిస్. ఈ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ దాదాపు రూ. 6.26 లక్షల కోట్లుగా ఉంటుంది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టయిన తొలి కంపెనీ కూడా ఇదే కావడం విశేషం.
టైమ్ తాజాగా విడుదల చేసిన బెస్ట్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్న మూడో ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీగానూ ఇన్ఫోసిస్ నిలవడం గమనార్హం. యాక్సెంచర్, డెలాయిట్ దీని కంటే ముందు వరసలో ఉన్నాయి. ఈ జాబితా విడుదలైన క్రమంలో ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ షేరు విలువ ఈ రోజు 0.34 శాతం పెరిగి రూ. 1,512 దగ్గర స్థిరపడింది. ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత వంటి అంశాల ఆధారంగా టైమ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలకు ర్యాంకులు కేటాయించింది. 58 దేశాల్లో మొత్తం 1.5 లక్షల ఉద్యోగులను సర్వే చేసినట్లు తెలిపింది. గత మూడేళ్ల ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఆధారంగా ఆదాయ వృద్ధిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. అలాగే కాలుష్య నియంత్రణ చర్యలు, మానవ హక్కులు, డైరెక్టర్ల బోర్డులో మహిళల సంఖ్య వంటి వివరాలను సైతం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.
టాప్-750 లిస్ట్‌లో భారత్ కంపెనీలు ఇవే..
- ఇన్ఫోసిస్ 64వ ర్యాంక్
- విప్రో 174వ ర్యాంక్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ 248
- హెచ్‌సీఎల్-262
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 418
- డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్- 596
- ఐటీసీ- 672
- Read Latest Business News and Telugu News
Infosys: మరోసారి జాక్‌పాట్ కొట్టేసిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. రూ.12 వేల కోట్ల డీల్.. ఇక తగ్గేదేలే!
Job Cuts: టెక్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. వందలాది మందిని తొలగించిన దిగ్గజ సంస్థ.. కారణం ఏంటంటే?
Apple Shares: అక్కడ ఐఫోన్లపై బ్యాన్.. కుదేలైన యాపిల్ షేర్లు.. 2 రోజుల్లో రూ.16 లక్షల కోట్ల నష్టం