News

Indu Kilaru,ప్రపంచ బ్యాంక్‌లో తెలుగమ్మాయికి ఉద్యోగం.. శభాష్ ఇందు – andhra pradesh young woman indu kilaru get job in world bank


చిన్నతనం నుంచి చదువుల్లో రాణిస్తూ.. పట్టుదలతో కష్టపడితే అనుకున్నది సాధించొచ్చని నిరూపించారు ఓ తెలుగమ్మాయి. ఏకంగా ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు కిలారు ఇందు. ఇందు సొంత ఊరు కృష్ణా జిల్లా పెనమలూరు.. సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి సత్యనారాయణ గెస్ట్‌ లెక్చరర్‌.. తల్లి మాధవి గృహిణి. విజయవాడలో బీటెక్‌ పూర్తి చేసి.. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లారు. ఎంఎస్‌ పబ్లిక్‌ పాలసీ చేసి.. ప్రపంచ బ్యాంకు ఉద్యోగం సాధిచారు.

అమెరికాలో ఎంఎస్‌ పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేయాలని భావించారట ఇందు. తాను ప్రపంచ స్థాయిలో మానవజాతిని ప్రభావితం చేయగల ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ సంస్థల్లో పని చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌– మేసన్‌లో ఎంఎస్, పబ్లిక్‌ పాలసీ కోర్సులో చేరానన్నారు. ఆమె అమెరికాలోనే ఎంతో పేరున్న ప్రొఫెసర్‌ టిమ్‌ స్మీడింగ్‌ దగ్గర నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నట్లు వివరించారు. యూనివర్సిటీ స్థాయిలో తాను ఇచ్చిన ప్రజెంటేషన్‌లు, పరిశోధనలతో ప్రపంచ బ్యాంకు ఉద్యోగం వచ్చింది అంటున్నారు.

ఇందుకు ప్రపంచ బ్యాంకు ఉద్యోగంలో దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వాతావరణ విభాగం బాధ్యతలను అప్పగించారు. వాతావరణ మార్పును అధ్యయనం చేసే నిపుణురాలిగా.. అలాగే జాయింట్‌ మల్టీ బ్యాంకు డెవలప్‌మెంట్‌, విధానాల రూపకల్పనలు, టెక్నాలజీ, అమలు చేయటం, వివిధ దేశాలలో వాతావరణ కాలుష్యం ప్రామాణికతల నిర్ణయం ఇలా మరికొన్ని కార్యక్రమాల అమలు తేడాలను విశ్లేషించడంపై బాధ్యతలు ఇచ్చారు. వీటిపై రిపోర్టులు తయారు చేయడం, ఎంవోయూలు చేసుకోవడం, సమావేశాల్లో చర్చించాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా జీ4 వీసా ఇచ్చింది.. ఇప్పటికే ఉద్యోగంలో చేరాలని ప్రపంచ బ్యాంకు నుంచి ఆదేశాలు వచ్చాయి.. త్వరలోనే ఆమె అమెరికా వెళ్లి విధుల్లో చేరనున్నారు.

ఇందు గతంలో కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాగే ఎంఎస్‌లో అత్యుత్తమ గ్రేడ్స్‌ సాధించి మూడు సెమిస్టర్లలో రూ.65 లక్షలు స్కాలర్‌షిప్ అందుకున్నారు. ఔట్‌స్టాండింగ్‌ స్టూడెంట్‌ అవార్డు, బెస్ట్‌ స్టూడెంట్‌ ఎంప్లాయ్‌గా గోల్డెన్‌ బ్రిక్‌ అవార్డు, బెస్ట్‌ పైరో ఫ్రైజ్‌ విన్నర్, బెస్ట్‌ పేపర్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలిసీ పురస్కారాలు దక్కాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గింపుపై తనవంతుగా అధ్యయనం చేస్తాను అంటున్నారు.. సాంకేతికంగా పాలసీని రూపొందించి దాని అమలుకు కృషి చేస్తానని చెబుతున్నారు ఇందు. మొత్తానికి అనుకున్నది సాధించి త్వరలోనే ప్రపంచ బ్యాంకులో ఉద్యోగంలో చేరబోతున్న ఇందుకు ఆల్ ది బెస్ట్.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button