News
Indian Overseas Bank,Locker: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. బ్యాంక్ కీలక నిర్ణయం.. ఇక ఇంట్లోంచే ఆ పని పూర్తి చేయొచ్చు! – iob indian overseas bank introduces online allotment of safe deposit locker facility
Locker: ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. తమ వినియయోగదార్ల కోసం సేఫ్ డిపాజిట్ లాకర్ సదుపాయాన్ని ఆన్‌లైన్‌లో కేటాయించడాన్ని ప్రారంభించింది. ఈ సేవలు అవసరమైన వారు బ్యాంక్ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పొందొచ్చని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఈ సేవలు కేవలం 2 నిమిషాల్లోనే పొందవచ్చని, కొన్ని క్లిక్స్ దూరంలోనే అందుబాటులో ఉంటుందని తెలిపింది. బ్యాంక్ పోర్టల్ www.iob.in ద్వారా సేఫ్ డిపాజిట్ లాకర్ కోసం అప్లై చేసుకుని నిమిషాల వ్యవధిలో పొందవచ్చని తెలిపింది.
బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం తమ కస్టమర్లతో పాటు ఇతరులు సైతం ఇంట్లో కూర్చునే సేఫ్ డిపాజిట్ లాకర్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. ఎనీ టైం.. ఎనీ వేర్ లాకర్ సదుపాయం అంటూ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ కొత్త ఫీచర్ మా విలువైన కస్టమర్లు (జనరేషన్ జడ్, సీనియర్ సిటిజన్లతో పాటు) సమయాన్ని తగ్గించడమే కాదు వారికి త్వరగా సేవలందించడం, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వినియోగదారులు భౌతికంగా బ్యాంకు శాఖకు రావాల్సిన అవసరం లేదు. కేటాయింపు లేఖ వారి మెయిల్కు, వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో మొబైల్‌కు తక్షణం పంపుతాం. ఈ డిజిటల్ అప్‌గ్రేడ్ అనేది మా కస్టమర్లకు బెస్ట్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అందించేందుకు మా నిబద్ధతకు నిదర్శనం. ‘ అని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
కొత్త కస్టమర్లు, ఐఓబీలో అకౌంట్ లేని వారు తమ మొబైల్ నంబర్స్, ఈ-మెయిల్ ఐడీలతో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకుని లాకర్ ఫెసిలిటీ పొందవచ్చని బ్యాంక్ తెలిపింది. కస్టమర్లు కేవలం కేవైసీ వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించేందుకు మాత్రం ఒకసారి బ్యాంకుకు వెళ్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త సేవల ద్వారా కస్టమర్లు ఇంట్లో నుంచే నేరుగా సేప్ డిపాజిటర్ లాకర్ కోసం అప్లై చేసుకుని పొందవచ్చని తెలిపింది. బ్యాంకులో గంటల తరబడి వేచి ఉండాల్సిన పని లేదని స్పష్టం చేసింది.
Also Read: దిగ్గజ బ్యాంక్ పండగ ఆఫర్లు.. లోన్లపై వడ్డీ రాయితీ.. క్రెడిట్ కార్డ్స్‌పై భారీ డిస్కౌంట్!
సామాన్యులకు ఊరట.. దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం.. అయినా!
బ్యాంక్ దివాలా తీస్తే పీపీఎఫ్ పెట్టుబడి కోల్పోవాల్సిందేనా?
సేవింగ్స్ ఖాతాతోనే 7 శాతానికిపైగా వడ్డీ.. ఈ ఒక్క బ్యాంకులోనే
- Read Latest Business News and Telugu News
Advertisement