News

Indian Idol 2: ఒకే స్టేజ్‌పై ఇద్దరు సెన్సేషన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌.. ఆహా ఇండియన్‌ ఐడల్‌లో దేవీశ్రీ సందడి. – Telugu News | Music director devi sri prasad attending as chief guest for Indian idol 2 in AHA OTT


తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఇండియన్‌ ఐడల్‌కి ఆదరణ పెరుగుతోంది. ఔత్సాహిక సింగర్స్‌లో ఉన్న ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ షో దూసుకుపోతోంది. మొదటి సీజన్‌ విజయవంతంగా పూర్తి కావడం, రెండో సీజన్‌ కూడా రెంట్టింపు ఉత్సాహంతో..

తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఇండియన్‌ ఐడల్‌కి ఆదరణ పెరుగుతోంది. ఔత్సాహిక సింగర్స్‌లో ఉన్న ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ షో దూసుకుపోతోంది. మొదటి సీజన్‌ విజయవంతంగా పూర్తి కావడం, రెండో సీజన్‌ కూడా రెంట్టింపు ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇండియన్‌ ఐడల్‌ రెండో సీజన్‌ కూడా ముగింపు దశకు చేరుకుంటోంది. తొలి సెమీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆరుగురు సింగర్స్‌ మాత్రమే మిగిలిపోయారు. దీంతో విజేత ఎవరనే దానిపై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే సెమీ ఫైనల్‌ ఎపిసోడ్‌ను మే 19, 20 తేదీల్లో ఆహాలో టెలికాస్ట్‌ చేయనున్నారు. ఈ ఎపిసోడ్‌కి ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు నిర్వాహకులు. ఈ ఎపిసోడ్‌కి ముఖ్య అతిథిగా మ్యూజిక్‌ సెన్సేషన్‌ దేవీశ్రీ ప్రసాద్‌ హాజరుకానున్నారు. దీంతో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్‌, థమన్‌ ఒకే స్టేజ్‌పై సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో థమన్‌, దేవీశ్రీ ప్రసాద్‌లు కలిసి నాటు నాటు సాంగ్‌ స్టెప్పులు వేయడం సందడిగా సాగింది.

ఇవి కూడా చదవండి



దీంతో ఈ ఎపిసోడ్‌ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ప్రేక్షకులకు ఎదురు చూస్తున్నారు. దేవీశ్రీ మార్క్‌ ఎనర్జీతో ఇండియన్‌ ఐడల్‌ స్టేజ్‌ దద్దరిల్లి పోయింది. సెకండ్‌ సీజన్‌లో బెస్ట్ ఎపిసోడ్‌గా ఇది నిలవనుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే 19, 20 తేదీల్లో రాత్రి 7 గంటల నుంచి టెలికాస్ట్ కానున్న ఈ సెమీఫైనల్‌ ఎపిసోడ్‌ను ఆహాలో వీక్షించేందుకు వెంటనే సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి.

Advertisement

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button