News

India Vs Australia,ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. కెప్టెన్ కేఎల్ రాహుల్, అనూహ్యంగా సీనియర్ స్పిన్నర్‌కు చోటు – rohit sharma and virat kohli rested from the first two odis against australia here is full squad


వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత ఆడనున్న చివరి వన్డే సిరీస్‌కు భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ మేరకు ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం రెండు జట్లను సోమవారం ఎంపిక చేసింది. తొలి రెండు వన్డేల కోసం ఎంపిక చేసిన జట్టులో పలువురు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసింది. తొలి రెండు వన్డేల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్‌లకు విశ్రాంతి నిచ్చారు. ఇక అనూహ్యంగా సీనియర్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌కు మూడు మ్యాచుల్లోను చోటు కల్పించారు.

గతేడాది జనవరిలో చివరగా అశ్విన్ వన్డే మ్యాచు ఆడాడు. అయితే వన్డే వరల్డ్ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న అక్షర్ పటేల్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో అశ్విన్‌ను వరల్డ్ కప్ జట్టులో తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా అశ్విన్.. తెల్ల బంతితో ప్రాక్టీసు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

తొలి రెండు వన్డేల కోసం భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

మూడో వన్డే కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్

ఇక ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా కూడా జట్టును ప్రకటించింది. మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

భారత్‌తో సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు:
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కేరీ, నాథన్ ఇల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్..
తొలి వన్డే: సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనుంది.
రెండో వన్డే: సెప్టెంబర్ 24న ఇండోర్ వేదికగా జరుగనుంది.
మూడో వన్డే: సెప్టెంబర్ 27న రాజ‌కోట్ వేదికగా జరగనుంది.

Advertisement

Related Articles

Back to top button