india slams pakistan, Kashmir Issue: ఐరాసలో మరోసారి పాక్‌కు భంగపాటు.. చురకలంటించిన భారత్ – india slams pak minister bilawal bhutto zardari kashmir remarks on un security council
‘‘నేను ప్రసంగాన్ని ముగించే ముంద, జమ్మూ కశ్మీర్ గురించి పాకిస్థాన్ ప్రతినిధి చేసిన పనికిమాలిన, నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను నేను కొట్టిపారేస్తాను’ అని ఆమె అన్నారు. ‘‘దీనికి బదులుగా సానుకూలత, ముందుకు వెళ్లడంపైనే మా దృష్టి.. మహిళలు, శాంతి, భద్రత ఎజెండా అమలును వేగవంతం చేయడానికి మా సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేయడానికి నేటి చర్చ చాలా ముఖ్యమైంది.. మేము చర్చ అంశాన్ని గౌరవిస్తాం.. సమయం ప్రాముఖ్యతను గుర్తించండి. కాబట్టి, మా దృష్టి ఆ అంశంపైనే ఉంటుంది’’ అని ఆమె స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొజాంబిక్ ప్రెసిడెన్సీలో జరిగిన కౌన్సిల్ చర్చలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి జర్దారీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో కాంబోజ్ దీటుగా బదులిచ్చారు. ‘‘కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లడఖ్‌ల మొత్తం భారత్‌లో ఉన్నాయి.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటీకి తమ అంతర్భాగమేనని గతంలో పలుసార్లు పాకిస్థాన్‌కు చెప్పాం..
పొరుగు దేశంగా పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలను భారత్ కోరుకుంటోంది.. అయితే అటువంటి సంబంధాలకు ఉగ్రవాదం, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించే బాధ్యత ఇస్లామాబాద్‌పై ఉందని నొక్కి చెప్పింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 2019 ఫిబ్రవరిలో పాక్‌లోని బాలాకోట్‌లోని జైషఏ మహ్మద్ (JeM) ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత్ వైమానిక దాడులతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి
Read More Latest National News And Telugu News