News

IND vs WI T20: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియా కప్‌లో రోహిత్ శర్మ డౌటే? | Rohit sharma injury updates: team india captian rohit sharma retires hurt with back spasm says bcci ind vs wi 3rd t20 match telugu cricket news


Rohit Sharma: 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మూడో మ్యాచ్ నుంచి భారత అభిమానులకు ఓ చేదువార్త కూడా వచ్చింది.

IND vs WI T20: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మూడో మ్యాచ్ నుంచి భారత అభిమానులకు ఓ చేదువార్త కూడా వచ్చింది. కాగా, భారత జట్టు 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్‌కు వచ్చాడు. 5 బంతులు ఆడి ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. మొత్తంగా 11 పరుగులు చేసిన తర్వాత కొంత ఇబ్బంది పడుతూ కనిపించాడు. వైద్య బృందం మైదానానికి వచ్చి రోహిత్ శర్మను పరీక్షించారు. దీంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు.

గాయం గురించి బీసీసీఐ, రోహిత్ స్వయంగా వెల్లడి..

రోహిత్ వెన్నులో ఏదో సమస్య ఉంది. కండరాల ఒత్తిడికి సంబంధించిన ఫిర్యాదు కూడా ఉంది. రోహిత్‌కు ఆరోగ్యం బాగోకపోవడంతో రిటైర్‌మెంట్‌ తీసుకుని వైద్య బృందంతో కలిసి డగౌట్‌కు వెళ్లాడు. దీని తర్వాత, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఒక ట్వీట్‌లో రోహిత్ గాయంపై అప్‌డేట్ ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని బీసీసీఐ తెలిపింది. వైద్య బృందం ఆయనను పరీక్షిస్తోందని పేర్కొంది.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ గాయంపై పెద్దగా మాట్లాడలేదు. ‘ప్రస్తుతం కాస్త బాగానే ఉంది (నొప్పి). సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌కు కొంత సమయం ఉంది. ఇటువంటి పరిస్థితిలో గాయం నయం అవుతందని భావిస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ గాయం తగ్గినా.. ఆసియా కప్‌ 2022 నేపథ్యంలో బీసీసీఐ హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాకాకుండా గాయం తీవ్రమైతే మాత్రం.. నెల రోజుల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే కీలక టోర్నీగా పరిగణించిన ఆసియా కప్‌ 2022కు రోహిత్ శర్మ దూరం అయ్యే ఛాన్స్ ఉంది.

సూర్యకుమార్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 164 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 73 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ 44 బంతుల్లో 76 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Advertisement

ఆసియా కప్‌ 2022 షెడ్యూల్‌..

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జైషా ఆగస్ట్ 2న ఆసియా కప్‌ 2022 షెడ్యూల్‌ను సోషల్ మీడియాలో ప్రకటించారు. షార్జా, దుబాయ్‌ వేదికలుగా ఈ టోర్నీ జరగనుంది. ఆగస్ట్‌ 27 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ టీంలు తొలిపోరులో తలపడనున్నాయి. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారత్‌, పాకిస్తాన్ ఉత్కంఠ మ్యాచ్ ఆగస్ట్‌ 28న షెడ్యూల్ చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button