ind vs wi 3rd t20i hightlights, IND vs WI మూడో టీ20లో విండీస్‌కి సూర్య పంచ్.. టీమిండియా అలవోక గెలుపు – suryakumar yadav, rishabh pant star in india’s 7-wicket win vs west indies
మూడో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. బ్రాండన్ కింగ్ (20: 20 బంతుల్లో 3×4)తో కలిసి వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్ కైల్ మేయర్స్ (73: 50 బంతుల్లో 8×4, 1×6) ఆరంభం నుంచి దూకుడుగా ఆడేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ నిలకోస్ పూరన్ (22: 23 బంతుల్లో 2×4, 1×6), రొవ్‌మెన్ పొవెల్ (23: 14 బంతుల్లో 2×4, 1×6), సిమ్రాన్ హెట్మెయర్ (20: 12 బంతుల్లో 2×6) క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడేస్తూ వచ్చారు. దాంతో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్య, అర్షదీప్ సింగ్ చెరొక వికెట్ తీశారు.
165 పరుగుల ఛేదనని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (11 రిటైర్డ్ హర్ట్: 5 బంతుల్లో 1×4, 1×6) దూకుడుగా ఆరంభించగా.. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (76: 44 బంతుల్లో 8×4, 1×6) ఆ వేగాన్ని కొనసాగిస్తూ ఒంటిచేత్తో టీమిండియాని గెలుపు తీరాలకి చేర్చాడు. రోహిత్ శర్మ రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ (24: 27 బంతుల్లో 2×4)తో కలిసి సూర్య బౌండరీల మోత మోగించేశాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో అతను కొట్టిన బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఆ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్.. టీమ్ స్కోరు 135 వద్ద ఔటైపోగా.. అప్పటికే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత గెలుపు లాంఛనాన్ని రిషబ్ పంత్ (Rishabh Pant) (33 నాటౌట్: 26 బంతుల్లో 3×4, 1×6) బౌండరీతో 19 ఓవర్లలోనే 165/3తో పూర్తి చేసేశాడు. అతనికి చివర్లో దీపక్ హుడా (10 నాటౌట్: 7 బంతుల్లో 1×4) సపోర్ట్ అందించాడు. విండీస్ బౌలర్లలో డొమినిక్, జేసన్ హోల్డర్, హొసెన్కి తలో వికెట్ దక్కింది.