News
ind vs wi 2nd t20i highlights, Team India ని ముంచిన నోబాల్ తప్పిదం.. లాస్ట్ ఓవర్లో గెలిచిన వెస్టిండీస్ – thomas late cameo helps west indies win thriller vs india
IND vs WI 2nd T20 మ్యాచ్‌లో గెలిచేలా కనిపించిన భారత్ జట్టు.. ఆఖరి ఓవర్లో అవేష్ ఖాన్ చేసిన చిన్న తప్పిదం కారణంగా ఓడిపోయింది. రవి బిష్ణోయ్ స్థానంలో రెండో టీ20లో అతను తుది జట్టులోకి వచ్చాడు.
ప్రధానాంశాలు:
- రెండో టీ20లో ఓడిన భారత్
- ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 138కే ఆలౌట్
- లక్ష్యాన్ని మరో 4 బంతులు ఉండగానే ఛేదించిన విండీస్
- లాస్ట్ ఓవర్లో భారత్ ఓటమికి కారణమైన అవేష్ ఖాన్
వాస్తవానికి భారత్ బౌలర్లు ఆఖరి వరకూ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి.. వెస్టిండీస్ బ్యాటర్లని కట్టడి చేశారు. దాంతో.. విండీస్ విజయానికి చివరి 12 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి రొవ్‌మెన్ పొవెల్ (5) వికెట్‌ని కూడా పడగొట్టాడు. దాంతో.. గెలుపు సమీకరణం ఆఖరి 6 బంతుల్లో 10 పరుగులుగా మారిపోయింది.
కానీ.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన అవేష్ ఖాన్ ఒత్తిడికి గురయ్యాడు. ఫస్ట్ బాల్నే నోబాల్‌గా విసిరాడు. దాంతో.. ఒక సింగిల్‌తో పాటు అదనంగా విండీస్‌కి మరో పరుగు కూడా లభించింది. ఆ తర్వాత ఫ్రీ హిట్ బంతికి సిక్స్ బాదిన థామస్.. రెండో బంతినీ బౌండరీకి తరలించేశాడు. ఇక మూడో టీ20 మ్యాచ్ సెయింట్ కిట్స్ వేదికగానే ఈరోజు రాత్రి జరగనుంది. ఐదు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
Web Title : Telugu News from Samayam Telugu, TIL Network