ind vs sl 2nd odi, Kolkata ODI: టాస్ గెలిచిన షనక.. శ్రీలంక స్టార్ ప్లేయర్ ఔట్.. భారత జట్టులో ఒక మార్పు – sri lanka win toss and opt to bat in 2nd odi vs india
తాను టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాడినన్న రోహిత్.. బ్యాటింగ్ చేయాలా.. బౌలింగ్ ఎంచుకోవాలా..? అనే విషయమై సందిగ్ధంలో ఉన్నానన్నాడు. గత మ్యాచ్‌లో తాము ఆడిదాన్ని బట్టి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలని అనుకున్నానని.. కానీ గ్రౌండ్‌ను చూశాక ఫీల్డింగ్ అనుకున్నానని తెలిపాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ఆడటాన్ని తాను ఇష్టపడతానన్నాడు. గత మ్యాచ్‌లో డైవ్ చేసే క్రమంలో గాయపడిన యుజ్వేంద్ర చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడన్నాడు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఔట్ ఫీల్డ్ వేగంగా ఉంటుంది. గ్రౌండ్ పెద్దదేం కాకపోవడంతో.. బౌలర్లకు అంతగా సహకరించదు. బ్యాటర్లకు అనుకూలించే ఈ పిచ్ మీద లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టమవుతుంది.
గువహటి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 67 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. బదులుగా శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులకే పరిమితమైన విషయం విదితమే.
శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, నువనిడు ఫెర్నాండో, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, లాహిరు కుమార, కసున్ రజిత.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్.