News

ind vs aus 2nd t20 highlights, IND vs AUS T20: ఆస్ట్రేలియా గెలుపు లెక్కని సరిచేసిన భారత్.. టీ20 సిరీస్ సమం – india defeats australia by 6 wickets in nagpur t20


భారత్ గడ్డపై టీ20ల్లో ఆస్ట్రేలియా గెలుపు లెక్కని టీమిండియా సరిచేసింది. వర్షం కారణంగా మైదానంలో చిత్తడిగా మారడంతో మ్యాచ్ సమయం వృథా అయ్యింది. దాంతో నాగ్‌పూర్‌లో శుక్రవారం రాత్రి కేవలం 8 ఓవర్ల మ్యాచ్ జరగగా.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 90 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని భారత్ జట్టు 7.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. దాంతో.. మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకి జరగనుంది.

91 పరుగుల లక్ష్యఛేదనని కేఎల్ రాహుల్ (10: 6 బంతుల్లో 1×6)తో కలిసి దూకుడుగా ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (46 నాటౌట్: 20 బంతుల్లో 4×4, 4×6) సిక్సర్ల మోత మోగించాడు. కానీ.. స్పిన్నర్ ఆడమ్ జంపా వరుస ఓవర్లలో రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లీ (11), సూర్యకుమార్ యాదవ్ (0) కూడా ఔట్ చేసి ఒత్తిడిలోకి నెట్టాడు. అయినప్పటికీ రోహిత్ శర్మ ఆఖరి వరకు టాప్‌ గేర్‌లోనే బ్యాటింగ్ కొనసాగించాడు. అలానే హార్దిక్ పాండ్య (9) ఒక ఫోర్ మాత్రమే కొట్టి ఔటైపోయినా.. చివర్లో దినేశ్ కార్తీక్ (10 నాటౌట్: 2 బంతుల్లో 1×4, 1×6) బౌండరీతో మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఆ జట్టులో మాథ్యూవెడ్ (43 నాటౌట్: 20 బంతుల్లో 4×4, 3×6), అరోన్ ఫించ్ (31: 15 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీశాడు. కామెరూన్ గ్రీన్ (5), స్టీవ్‌స్మిత్ (8) రనౌట్‌గా వెనుదిరిగారు.

Related Articles

Back to top button