News

IND vs AUS 2nd T20 టాస్ ఆలస్యం.. కారణమిదే



భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా ఈరోజు జరగబోతున్న రెండో టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాగ్‌పూర్ పరిసరాల్లో సాయంత్రం వర్షం పడటంతో మైదానం చిత్తడిగా మారింది. దాంతో.. సాయంత్రం 6:30 గంటలకి పడాల్సిన టాస్ కూడా ఆలస్యమవుతోంది.

మొహాలి వేదికగా గత మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో 208 పరుగులు చేసినా.. భారత్ జట్టు 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. పేలవం బౌలింగ్, నిర్లక్ష్యపు ఫీల్డింగ్ ఆ ఓటమికి కారణం. దాంతో ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో 0-1తో వెనకబడి ఉన్న భారత్ జట్టుకి.. సిరీస్‌పై ఆశలు నిలవాలంటే ఈరోజు మ్యాచ్‌లో గెలవాల్సిందే.

Related Articles

Back to top button